రేషన్ షాప్ లో ఉచిత రేషన్ బియ్యం

రేషన్ షాప్ లో ఉచిత రేషన్ బియ్యం

1
TMedia (Telugu News) :

రేషన్ షాప్ లో ఉచిత రేషన్ బియ్యం

టీ మీడియా, జూన్ 21, వనపర్తి బ్యూరో : ఉచిత రేషన్ బియ్యం ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సోమవారం వనపర్తి పట్టణంలోని కేడిఆర్ నగర్ 16వ డీలర్ రాధా రెడ్డి కోరారు. రేషన్‌కార్డుదారులకు మళ్లీ ఉచిత బియ్యం కరోనా విజృంభణతో అతలాకుతలమైన పేద కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డుదారులు ఒక్కొక్కరికి పది కిలోల వంతున రెండేళ్లుగా ఉచిత బియ్యం అందిస్తున్నాయి. ఈ గడువు గత మార్చి నెలతో ముగియగా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని పొడిగించింది. 2022 సెప్టెంబర్‌ వరకు ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించింది.

Also Read : కరోనా నుంచి కోలుకున్న సోనియా

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మే నెలలో ఒక్కో లబ్ధిదారుడికి రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుతం జూన్‌ నెలకు సంబంధించి ఈ నెల 18 నుంచి 26 వరకు ఒక్కొక్కరికీ 5 కిలోల వంతున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు రావడంతో పంపిణీకి ఏర్పాట్లు ఏర్పాటు చేశామని కాలనీ వాసులకు అందిస్తున్నామని డీలర్ రాధారెడ్డి అన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube