స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా ఫ్రెండ్ షిప్ డే

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా ఫ్రెండ్ షిప్ డే

1
TMedia (Telugu News) :

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా ఫ్రెండ్ షిప్ డే
టి మీడియా, ఆగస్టు 5,ఖమ్మం :నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు స్వీట్లు తినిపించి “ఫ్రెండ్ షిప్ బ్యాండ్” లను కట్టారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్నేహితుల దినోత్సవం యొక్క విలువను స్నేహం యొక్క విలువను చిరుప్రాయం నుండే విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, మంచి స్నేహం మంచి స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలని, విద్యార్థులకు తెలియపరిచారు. విద్యార్థులు ఒక్కరికి ఒకరు ఆత్మీయ లింగం చేసుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

 

Also Read : నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు

 

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ కులం మతం ప్రాంతం అనే విభేదాలు లేకుండా స్నేహ బంధాలు కొనసాగాలని, స్నేహబంధం అనేది పరస్పర సహాయ సహకారాలు అందించుకునే విధంగా ఒకరి కష్టాలు ఒకరు పంచుకునే విధంగా ఆప్యాయత అనురాగాలతో ముందుకు సాగాలని, స్నేహం అన్నిటికన్నా గొప్పదైనదని, చిరకాలం వరకు కేవలం మంచి మిత్రులు మిగులుతారని అందుకే స్నేహానికి అంత గౌరవం ఉందని, స్నేహం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, పాఠశాలలో ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది.విద్యార్థులు మంచి స్నేహబంధాలతో చక్కని వాతావరణంలో తమ చదువులను కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube