10 నుంచిఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలు

10 నుంచిఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలు

1
TMedia (Telugu News) :

10 నుంచిఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలు
టీ మీడియా,ఏప్రిల్09తిరుపతి : అమరావతి : కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9న శాస్త్రోక్తంగా అంకురార్పణచేయనున్నట్లుటీటీడీఅధికారులువెల్లడించారు.ఉదయంసుప్రభాతంతోస్వామివారినిమేల్కొలిపిమూలవర్లకువ్యాసాభిషేకం,ఆరాధన, అర్చన నిర్వహిస్తారని, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్ 10న ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, కవి సమ్మేళనం, శేష వాహనసేవ నిర్వహిస్తారని తెలిపారు.11న వేణుగాన అలంకారం, హంస వాహనంపై ఊరేగింపు , 12న వటపత్రశాయి అలంకారంలో సింహవాహనంపై ఊరేగిస్తారని వివరించారు. నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ‌, 14న మోహినీ అలంకారం, గరుడసేవ, 15 న శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం , గ‌జవాహనం. 16న రథోత్సవం, 17 కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనంపై స్వామివారు ఊరేగిస్తారని అధికారులు తెలిపారు. 18న చక్రస్నానం, ధ్వజావరోహణం అర్చకులు నిర్వహిస్తారని వెల్లడించారు.

Also Read;తెలంగాణ వడ్లను బేషరతుగా కేంద్రం సేకరించాల్సిందే

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube