ఎగ్జామినేషన్ శిక్షణ కొరకు ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు.

ఎగ్జామినేషన్ శిక్షణ కొరకు ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు.

1
TMedia (Telugu News) :

ఎగ్జామినేషన్ శిక్షణ కొరకు ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు

టి మీడియా, ఏప్రిల్ 14 భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ భద్రాచలం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లా షెడ్యూల్ తెగల (ఎస్ టి )యువతీ, యువకులకు పోలీస్ గ్రూప్-1 మరియు గ్రూప్-1ఉద్యోగ నియామకాల కొరకు ప్రతి కేంద్రానికి 100 మంది చొప్పున 9 కేంద్రాలలో 900మందికి ఉచిత ఫ్రీ ఎగ్జామినేషన్ శిక్షణ కొరకు ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి గౌతం పోట్రూ ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read;సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు
అభ్యర్థులను ఫ్రీ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉచిత కోచింగ్ కొరకు అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలని ఆయన అన్నారు.
ఆసక్తి మరియు అర్హత కలిగిన గిరిజన యువతీ, యువకులకు దరఖాస్తులను ఆన్లైన్లో https://studycircle.cgg.gov.in/tstw ద్వారా తేదీ 4-42022 నుండి15-4-22 వరకు సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన అన్నారు. ఈ ఉచిత శిక్షణను భద్రాచలం, కొత్తగూడెం ,ఖమ్మం కేంద్రాలలో ఇవ్వబడును.శిక్షణా కాలంలో ఉచిత భోజనం మరియు వసతి, నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ తో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వబడును అని ఆయన పేర్కొన్నారు

Also Readబహుమతులను ప్రదానం చేసిన ఏసిపి
ఆన్లైన్ టెక్నికల్ ఇబ్బందుల కొరకు 040-27540104, ఇతర వివరములకు కొరకు డిడి ట్రైబల్ వెల్ఫేర్ భద్రాచలం, డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఖమ్మం మరియు ప్రిన్సిపాల్ పి ఈ టి సి భద్రాచలం కార్యాలయాలకు ఉదయం 10-30 నుండి సాయంత్రం 5-00 గంటల లోపు కార్యాలయం పరిధిలో ఫోన్ నెంబర్లు 7981962660,9550813062
లకు సంప్రదించాలని ఆయన తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube