
ఆటో డ్రైవర్ నుండి డ్రగ్స్ సప్లయర్ వరకు
– పాల్వంచ లో ఉన్నప్పుడే పలు ఆరోపణల
– రాయన్న పేటలో నే రౌడీ పనులు ఆరంభం
– ప్రముఖులు తో సాన్నిహిత్యం
– ఖమ్మం ప్రముఖ ఆస్పత్రిలో ఇటీవల సర్జరీ
టి మీడియా,జూన్ 19,ప్రత్యేక ప్రతినిధి: అటు టాలి ఉడ్ తో పాటు ఇటు హైద్రాబాద్ ,ఖమ్మం నగరం లోని ప్రముఖులు ,అధికారులు,ప్రజా ప్రతినిధులు కొంత మంది నీ కలవర పెడుతున్న ,డ్రగ్స్ అమ్ముతూ పట్టు బడ్డ ఖమ్మం జిల్లా భోనకల్లు మండలం రా యన్న పేటకు చెందిన సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపి గురించి అనేక విషయాలు వెల్లడి అవుతున్నయి. అతనిని కస్టడీ లోకి తీసుకొని ప్రశ్నించ టం, మరో వైపు క్షేత్ర స్థాయి పరిశోధన లో పలు కీలక సమాచారం సేకరణ చేసినట్లు తెలిసింది. టి మీడియా కి అందిన సమాచారం ప్రకారం…
కేపి తల్లి విజయమ్మ ప్రభుత్వ టీచర్ ,ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ లో పని చేస్తున్న రు.తండ్రి న్యాయ వాధి ఇటీవలే చనిపోయారు. సొంత ఊరు రాయాన్న పేట లోనే ఆయన దందాలు ప్రారంభం అయ్యాయి. చిన్న నాడే అల్లరి ,చిల్లర వేషాలు వేశాడు. తన సామాజిక కార్డ్ ఉపయోగించి ఆయన అనేక నేరాలు కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఉద్యోగ రీత్యా పాల్వంచ లో స్థిర పడ్డ ఆయనకు మూడు ఏళ్లనుండితల్లి తోను సమందాలు లేవు.మూడు పెళ్ళిళ్ళు ఆరోపణలు ఉన్నయి. కొడుకు గురించి ఎవరైనా అడిగితే చని పోయాడు అని తల్లి చెప్పింది అని ఆ కుటుంబ సన్ని హితులు పేర్కొంటున్నారు.
1999 లో ఆటో డ్రైవర్
కేపి చౌదరి 1999.2001 వరకు రెండు యేళ్లు పాల్వంచ కొత్తగూడెం మధ్య ఆటో నడిపాడు.డ్రైవర్ గా వ్యవహరించారు పాల్వంచ బస్టాండ్ అడ్డ గా ఉండేది.అప్పుడు అక్కడ కొంత మందికి తక్కువ రేటుకు బంగారం వస్తోంది అని కొంతమంది వద్ద ,మెడికల్ సీట్లు ఇప్పిస్తా అని మరికొంత మంది వద్ద వసూలు చేశారని ఆరోపణ.ఆవిధంగా ఆర్థికంగా కొంత వెసులు బాటు రావడం,స్థానికంగా ఇబ్బంది కలగడము తో హైద్రాబాద్ కి మకాం మార్చారు.అక్కడ సామాజిక వర్గం కార్డు ద్వారా అప్పటికే అక్కడ స్థిరపడ్డ ఉమ్మడి జిల్లా ప్రముఖులు తో సన్ని హిత సమంధాలు ఏర్పడ్డాయి.ఆ క్రమంలో ఖమ్మం జిల్లా లోని,మధిర,నేలకొండపల్లి, కొత్తగూడెం,సత్తుపల్లి ప్రాంతాల్లోని మామిడి తోటల్లో పేకాట క్లబ్ లు కూడా నిర్వహణ చేశారని ఆరోపణ ఉన్నయి. అక్రమ సంపాదన, బడాబాబులు పరిచయాలు తో 20బి16 లో సినిమా రంగం లో కి ప్రవేశం చేశారు. అక్కడ నష్టాలు చవి చూసాడు.ఈ క్రమంలో 3 యేళ్లు క్రితం ఓక సారి సొంత ఊరు రాయన్న పేట వచ్చారు. సినిమా రంగం లో నష్టాలు పూడ్చు కోవాదానికి గోవా బాట పపట్టాడు.అక్కడ అనుమతి లేకుండా ఓహెచ్ ఏం అనే హోటల్ పెట్టడు.ఆధి నష్టాలు పాలయింది.ఆ క్కడే డ్రగ్ ఫ్లెడ్డర్స్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇన్ని పరిణామాలు జరిగినా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ని ప్రముఖులు ,అధికారులు తో సమాందాలు కొనసాగించాడు. వారి కి రేవు పార్టీలు నిర్వహణ చేసినట్లు ఆరోపణలు ఉన్నయి.డ్రగ్స్ కూడా సరఫరా చేశారు అనే విషయ ము పై స్పష్టత లేదు

సెటిల్ మెంట్లు దందాలు
ఖమ్మం కేంద్రం గా తనకు అధికారులు,ప్రజా ప్రతినిధులు తో ఉన్న సమందాలు వినియోగించు కొని పలు దందా లు సెటిల్ మెంట్లు చేసి నట్లు పోలీస్ అధికారులు నిర్దారణకు వచ్చినట్లు తెలిసింది.
డాన్ తో సాన్నిహిత్యం
నగరం లో నివాసం ఉండే ప్రక్క జిల్లా కు చెందిన మద్యం డాన్ గా పేరున్న వ్యక్తి తో కేపి సన్ని హిత సమందాలు ఉన్నట్లు తెలిసింది.ఇద్దరు కలిసి పలు సెటిల్ మెంట్లు డాన్ నివాసం కేంద్రం గా చేసినట్లు తెలిసింది. మహభుభాధ్ జిల్లా లో 10 యేళ్లు క్రితం రిజిస్టేషన్ అయిన భూమి పై కన్నేసి కబ్జా కు తెరలేపినట్లు తెలిసింది. ఇతను నగరం లో ప్రముఖులు, ఉన్నత స్థాయి అధికారులు నివాసం ఉండే కమ్యూనిటీ లోనే నగరానికి వచ్చి నప్పుడు తిష్ట వేసి నట్లు తెలిలిసింది. ఆ కమ్యూనిటీ లోని కొందరు , వైరా రోడ్ లోని మరో ప్రముఖ కమ్యూనిటీ లోని వారు ఇతని రేవ్ పార్టీలకుహజరునయినట్లు గా ఆరోపణలు ఉన్నయి. ప్రస్తుతం నగరం లో నివాసం ఉంటున్న టాలీ ఉడ్ వారి తో అంట కాగిన మరో వ్యక్తికి ఇతనికి ఉన్న లింకులు పైనా అరా జరుగుతోంది. ఏది ఏమైనా మామాజీ ఆటో డ్రైవర్ కేపి ఇంత పని చేస్తున్న డు అనుకోలేదని పాల్వంచ కు చెందిన కొంతమంది అన్నారు.అబ్బే మాకేం తెలియదు , ఎప్పుడూ అతనిని చూడలేదు.పెరు విన్న అంటూ పలువురు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రముఖులు బుజాలు తడుము కొంటున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube