ఫ్రంట్ లైన్ వారియర్ డాక్టర్ నరేష్ కుమార్ మృతి పట్ల టి.ఆర్.ఎస్ లోక్ సభ పక్ష నేత నామ దిగ్ర్భాంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్ఓ, మణుగూరు క్వారంటైన్ కేంద్రం ఇంచార్జి ఆఫీసర్ డాక్టర్ నరేష్ కుమార్ మృతి పట్ల టి.ఆర్.ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.విధుల పట్ల అంకిత భావంతో
కరోనా వార్డు లో సేవాలందిస్తూ ఆ మహమ్మారి బారిన పడి యువ వైద్యుడు నరేష్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

కరోనా వైరస్ నిర్ములనలో వైద్యులు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారని, విధుల్లో చురుకుగా ఉంటూ ప్రజా రక్షణ లో ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు.

డాక్టర్ నరేష్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నామ భరోసా ఇచ్చారు.

కరోనా తో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్ డాక్టర్ నరేష్ కుమార్ మృతి పట్ల నామ తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.