డాక్టర్స్ డే సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

డాక్టర్స్ డే సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

1
TMedia (Telugu News) :

డాక్టర్స్ డే సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

టీ మీడియా,జూలై 1,జన్నరం : సమాజ్వాది పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ను శుక్రవారం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ప్రసాద్, ఆయుర్వేద వైద్యులు సత్యనారాయణ రావు లకు పూల బొకేలు అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న 30 మంది రోగులకు బ్రెడ్డు, అరటి పండ్లు, సేపులను అందించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

 

Also Read : చిన్నారి వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం

 

సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ్వాది పార్టీని ఖానాపూర్ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే సమాజ్వాది పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జన్నారం మండల అధ్యక్షుడు చింత అనిల్ మహేంద్ర నాయకులు, మొగురం రామస్వామి, సతీష్, రాజేష్, గణేష్ శ్రీమాన్ ,అభి ,సాయి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube