బిల్లు ఆమోదం పొందేవరకు సంపూర్ణ మద్దతు
-సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
టీ మీడియా,మార్చి 10, ఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు. ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది, కానీ లోక్‌సభ ఆమోదముద్ర వేయలేదని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోదీ కూడా మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఆయన ప్రధానమంత్రి అయి తొమ్మిదేండ్లు పూర్తయినా ఇప్పటివరకు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని పట్టుబడతామని చెప్పారు
Also Read : కూలర్‌తోనే ఏసీని మించిన చల్లదనం..!
18 పార్టీల సంఘీభావం
ఈ దీక్షకు సీపీఐ, సీపీఎంతో పాటు.. ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఈ దీక్షలో దాదాపు 5వేల మంది ఈ దీక్షలో భాగస్వామ్యం అయ్యారు. దీక్ష నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులను మొహరించారు.