బర్రెలక్కకు మా సంపూర్ణ మద్దతు

ప్రైవేట్ లెక్చరర్ సిరివాటి గోవర్ధన్

0
TMedia (Telugu News) :

బర్రెలక్కకు మా సంపూర్ణ మద్దతు

– ప్రైవేట్ లెక్చరర్ సిరివాటి గోవర్ధన్

టీ మీడియా, నవంబర్ 25, పెబ్బేరు : పెబ్బేరు మండల కేంద్రంలో ఓ ప్రైవేటుకళాశాల లెక్చరర్ సిరివాటి గోవర్ధన్ కొల్లాపూర్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై 9 సంవత్సరాలు కావస్తున్నా సంపూర్ణంగా ఉద్యోగాలు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని కొండంత ఆశతో ఎదురు చూస్తూ. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఎట్టకేలకు మొండి చెయ్యే మిగిలింది. బంగారు తెలంగాణ అంటూ సంకలు బాదుకున్న కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు కెసిఆర్ కు ఈ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. కొల్లాపూర్ నియోజక వర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీష ఇందుకు చక్కటి ఉదాహరణ అని అన్నారు. నిరుద్యోగుల కడుపు మండితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Also Read : 100 మంది కేసీఆర్‌లు వచ్చినా నన్ను ఓడించలేరు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులు చైతన్యవంతం కావాలని పిలుపునిచ్ఛారు. భయపడుతూ చేతులు ముడుచుకు కూర్చున్నంతకాలం డబ్బున్న బడా నాయకులంతా బెదిరింపులు చేస్తూనే ఉంటారని, అలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియా శిరీష కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమెకు ఇకనుండి యా ప్రపంచమే అండగా ఉంటుందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube