రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు గద్దల సిరి

అభినందించిన హెచ్ఎం ,ఉపాధ్యాయులు

1
TMedia (Telugu News) :

రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు గద్దల సిరి
— అభినందించిన హెచ్ఎం ,ఉపాధ్యాయులు

టి మీడియా, జూలై 01,ఖమ్మం :నగరంలో మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ‘గద్దల సిరి’ సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14 విభాగం టేబుల్ టెన్నిస్ ఆటలో అత్యంత ప్రతిభ కనబర్చి మెడల్ సాధించడంతో రాష్ట్రస్థాయి టోర్నమెంట్లోకి ఎంపిక అనివార్యమయ్యింది. పిఈటి రోజా ప్రోత్సాహం, కోచ్ విఎస్ఎస్ మూర్తి కృషి, తల్లిదండ్రుల సహాయ సహకారాలతో తన ముందున్న లక్ష్యాన్ని సేదించగలిగానని విద్యార్థిని గద్దల సిరి పేర్కొన్నారు.

 

Also Read : మిషన్ భగీరథ నీటిపై అవగాహన

ప్రభుత్వ పాఠశాల నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం వలన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి శాంత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు… గద్దల సిరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ముందు ముందు మరిన్ని పథకాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube