గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆయనే

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆయనే

1
TMedia (Telugu News) :

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆయనే

-మొదట ఉద్యమకారుడు.

-అనంతరం రాష్ట్ర నేత..

-ఇప్పుడు దేశ్ కీ నేత..

టీ మీడియా,అక్టోబర్ 5,హైద్రాబాద్:

 

 

తెలంగాణ ఉద్యమంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కేసీఆర్ పేరు తెలియని వారుండరు. 2001 నుంచి.. 2014 వరకూ టీఆర్ఎస్ ఉద్యమాలేంటి? తెలంగాణ సాధనలో కీలక ఘట్టాలేంటి? నాటి నుంచి నేటి వరకూ కేసీఆర్- ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ పరిణామ క్రమం ఎలాంటిది?

ఢిల్లీ వరకూ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దాడుతాం.. అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కేసీఆర్.. కి విద్యార్ధి దశ నుంచీ రాజకీయాలంటే ఆసక్తి.. ఇవాళ సీఎం కేసీఆర్- రేపటి దేశ్ కీ నేతా కేసీఆర్.. తొలి నాళ్లలో స్టూడెంట్ లీడర్ గా ఫెయిల్యూరర్.. విద్యార్ధి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారాయన. తర్వాత కాంగ్రెస్ లీడర్ అనంతుల మదన్ మోహన దగ్గర రాజకీయ శిష్యరికం చేసిన కేసీఆర్.. 70ల కాలంలో యువజన కాంగ్రెస్ లీడర్ గా ఎదిగారు. తానెంతగానో అభిమానించే.. ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో.. కాంగ్రెస్ కి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్ పై పోటీ చేసి.. 877 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

 

. also read :సముద్రంలో ఏడుగురు విద్యార్థుల గల్లంతు

1985లో టీడీపీ తరఫున తిరిగి పోటీ చేసి.. గెలిచారు. అదే ఆయన తొలి విజయం. విజయపు రుచి మరిగిన కేసీఆర్ ఇక వెను దిరిగి చూసుకోలేదు. 1989, 94, 99, 2001 వరకూ వరుసగా గెలిచారు. 1987- 88 మధ్య నాటి మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. 1992- 93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ పదవి సైతం నిర్వహించారు. 1997- 98లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణా మంత్రిగా సేవలందించారు. 1999 లో చంద్రబాము మంత్రివర్గంలో స్థానం కోల్పోడం.. ఒక కీలక పరిణామంగా అంచనా వేస్తారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల వారు.

2021 ఏప్రిల్ 21న టీడీపీకి.. డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి.. అదే ఏడాది ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ స్థాపించారు కేసీఆర్.

తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ కార్యాచరణ కేసీఆర్ ను విపరీతంగా ప్రభావితం చేశాయి. దానికి తోడు టీఆర్ఎస్ స్థాపించిన ఏడాదిలోనే.. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డంతో.. తెలంగాణ ఏర్పాటు అసాధ్యమేమీ కాదన్న అభిప్రాయం ఏర్పడింది.

మంత్రి వర్గం స్థానం కోల్పోవడమనే అసంతృప్తి ఒకటైతే.. వరుసగా తాను సిద్ధిపేట నుంచి సాధిస్తోన్న విజయం కేసీఆర్ లో విపరీతమైన రాజకీయ నమ్మకాలను ఏర్పరిచాయి. పార్టీ స్థాపించక ముందే.. తెలంగాణ ఏర్పాటు దాని ఆవశ్యకత గురించి అధ్యయనం చేయడంతో.. కేసీఆర్ కి ఉద్యమ నాయకత్వం వహించాలన్న ఆలోచన మరింత బలపడింది.

 

also read :గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్

టీఆర్ఎస్ స్థాపించిన ఇరవై రోజులకే 2001 మే 17న తెలంగాణ సింహగర్జన అనే భారీ బహిరంగ సభ పెట్టి.. తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించారు కేసీఆర్. ఆపై తన వాగ్దాటి, రాజకీయ వ్యూహాలకు మరింత పదను పెడుతూ.. ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుతో వెళ్లి 26 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. నాటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశం చేర్చారు. యుపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలోనూ చేర్చారు. తెలంగాణకు అనుకూలంగా 36 పార్టీలు లేఖలు ఇచ్చాయి. టీఆర్ఎస్ ఐదు ఎంపీ స్థానాల్లో గెలిచింది. కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రులు అయ్యారు. తరువాత తెలంగాణ అంశం తేల్చడం లేదు అన్న కారణంతో బయటకు వచ్చారు.

2006 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బారీ మెజార్టీతో గెలిచారు కేసీఆర్. కాంగ్రెస్ వల్లే గెలిచారన్న విమర్శనొక సవాల్ గా తీసుకుని రాజీనామా చేశారు. కనీవినీ ఎరుగని మెజార్టీతో కరీంనగర్ నుంచి గెలిచారు కేసీఆర్. ఆ ఎన్నిక ఎంత ప్రభావం చూపిందంటే, రాష్ట్రం విడిపోతుందన్న ఉద్దేశంతో ఆంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పెరిగింది.

కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందంటూ కేసీఆర్.. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలో మహా కూటమితో పొత్తు పెట్టుకున్నారు. కేవలం 10 చోట్లే గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే తెలుగుదేశం, వామపక్ష పార్టీల మహా కూటమిని కాదని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు మద్దతు ఇస్తూ ఆ కూటమి లూథియానాలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొని, ప్రసంగించారు

 

also read :అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకం కట్టడాలు

ఆ ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలవుతున్నాయనే ప్రచారం భారీగా జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలవడంపై తీవ్ర చర్చ జరిగింది.

2009 అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు. 2009 నవంర్ 29న సిద్ధిపేట కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు. ఆ ప్రకటన తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది. విద్యార్థులు పెద్ద ఎత్తన రోడ్లపైకి వచ్చారు. ఆరోజ నుంచి తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వ విద్యాలయం నిప్పుల కొలిమిలా మారింది. కేసీఆర్‌ను దీక్ష చేయకుండా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆయన జైల్లో దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ తరలించారు. అక్కడా దీక్ష కొనసాగింది.

సిద్ధిపేటలో హరీశ్ రావు కిరోసిన్ పోసుకున్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో అన్న నినాదం మార్మోగింది. తెలంగాణ భగ్గుమనడంతో కేంద్రం కదిలింది. డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసింది. అప్పటి హోం శాఖ మంత్రి చిదంబరం స్వయంగా ఈ ప్రకటన చేశారు.

ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. తమ విజయంగా పేర్కొన్నారు. తెల్లారిన తరువాత ఆంధ్రలో సీన్ మారింది. వెంటనే సమైక్యాంధ్ర అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబరు 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం.

దీంతో హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు జానా రెడ్డి ఇంట్లో తెలంగాణ జేఏసీ ఏర్పడింది. కోదండరాం నాయకత్వంలో జేఏసీ పనిచేయగా, అందులో టీఆర్ఎస్ ప్రధాన భాగమైంది. 2010 డిసెంబర్‌లో వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ మహాగర్జన నిర్వహించింది. ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభల్లోనే అతి పెద్ద సభ. 30 లక్షల మంది హాజరయ్యారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారంటే పరిస్థితేంటో అర్ధం చేసుకోవచ్చు.

 

also reADఈడీ నోటీసుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలు

2011 జనవరిలో శ్రీకృష్ణ కమిటి నివేదిక తరవాత ఆందోళన కొనసాగుతూనే వచ్చింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె.. ఒక్కటేమిటి.. అనేక రూపాల్లో తెలంగాణలోని అన్ని వర్గాలూ ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఉద్యమం నిజంగానే ఉవ్వెత్తున ఎగిసింది.

పోరాట రూపాలెన్నున్నా, ఆందోళన కార్యక్రమాలు ఎన్ని జరిగినా టీఆర్ఎస్ తన ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రచిస్తూనే వెళ్లింది. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘటనలయ్యాయి.

చివరగా 2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. జూన్ 2 ఆవిర్భావ తేదీగా ప్రకటించింది. ఇక్కడి వరకూ కేసీఆర్ ఉద్యమ ప్రస్తానం.. టీఆర్ఎస్ కీలక పాత్ర ఒక దశ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube