“ఢిల్లీ” లో గల్లియవ్వారం
– వార్షికోత్సవం పేరుతో వసూళ్లు పర్వం
– రు2500 లు చెల్లిస్తే ఇద్దరి కి మాత్రమేఎంట్రీ
– పెరెంట్లు కు ప్రత్యేక సర్క్యులర్
– గోల్డ్,వి ఐ పి ల పేరుతో ఉచితంగా పాస్ లు
– ఏప్రియల్ ప్రోగ్రాం కు ఫిబ్రవరి నుండి కలెక్షన్స్
టీ మీడియా, మార్చి2, ప్రత్యేక ప్రతినిధి : పేరుకే ఢిల్లీ అంత అక్కడ గల్లి వ్యవహారం లు నడుస్తాయి..మంచి బుద్దులు విద్యార్థులు కు నేర్పి వివక్ష లేని సమాజం నిర్మాణం చేయించాల్సిన యాజిమాన్యం గలిజ్ వ్యవహారం కు తెర లేపింది. విద్యార్థులు వారి తల్లి తండ్రులు మధ్య ఆత్మీయత లు పెంచే వార్షికోత్సవం అసరా చేసుకొని 2 నెలల ముందు నుండే వసూళ్లు ప్రారంభించారు. ఉత్వవానికి హాజరయ్యే వారిని మూడు క్యాటగిరి లు గా విబజించి వివక్ష కు తెరలేపారు..
ప్రతి విద్యార్థి రు 2500 లు చెల్లించాలి అని ప్రిన్స్ పాల్ పేరున ప్రత్యేక సర్క్యులర్ పేరెంట్స్ కి వెళ్ళింది.డబ్బులు చెల్లిస్తే ఇద్దరు హాజరు అవడానికి అవసరం అయిన పాస్ జారీ చేస్తున్నారు.ఇద్దరు అంటే విద్యార్థి తో పాటు తల్లి,తండ్రి కాకుండా మరొకరు అనుమతి ఇస్తా రా అన్నది తెలవదు అని ఓక పేరెంట్స్ టీ మీడియా ఎదుట వాపోయారు.. ఫీజులు,ఇతరత్రా చెల్లింపులు చేసే తమ వద్ద తలకు 2500 లు వసూలు చేసి, వి ఐ పీ లు, ఏమర్జన్సి విధులు నిర్వర్తించే వారు అంటూ భారీ వేతనాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులు కు ఉచిత ప్రవేశం ఏంటి అని ప్రశ్నించారు..విద్యార్థులు తల్లి తండ్రుల లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి ఫ్రంట్ వారియర్స్ పేరుతో వార్షి కోత్యవం కు వారికి ఉచిత ప్రవేశం,ముందు వరుసలో ప్రత్యేక సిటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థి ల్లో విభజన,వివక్షలు నూరి పోస్తున్న రని అన్నారు.
Also Read : కరివేపాకు రసంతో బోలెడు ప్రయోజనాలు..
మూడు క్యాటగిరి పాస్ లు
మూడు క్యటగిరి పాస్ లు ఇస్తున్న రు.ఏప్రియల్ 8 న సాయింత్రం 4.30 కి కార్యక్రమం ప్రారంభం అని ,రాత్రి 7 గంట ల నుండి బోజనాలు అని పేర్కొన్నారు .
మొదటి రకం గోల్డెన్ పాస్ లు..ఈ పాస్ లు ఏటువంటి చెల్లింపులు చెయ్యని వారికి ఇస్తారు.స్కూల్ యాజి మాన్యం సర్క్యులర్ లో పేర్కొన్న వివరాలు ప్రకారం 24గంటలు వారం అంత జనం కోసం శ్రమించే డాక్టర్లు,పోలీస్ శాఖ వారు,రెవిన్యూ తదితరులు కు అని చెప్పారు. ఆ యా ప్రభుత్వ శాఖలలో ఏ స్థాయి వారికి గోల్డెన్ పాస్ లు అన్నది స్పష్టత లేదు.. వీరి పాసులు పై 4.30 గంటల నుండి ప్రోగ్రాం ప్రారంభం అని పేర్కొన్నారు.
రెండవ క్యాట పెరెం ట్ (లు కాదు)పాస్ లు ఈ పాస్ ల పై ప్రోగ్రాం 4గంటలకు ప్రారంభం అని పేర్కొన్నారు.
ముడవరకం:ఐవీ వి ఐ పీ పాస్ లు గా ముద్రించారు .వీటి పై సాయిత్రం 5 గంటలకు ప్రోగ్రాం ప్రారంభం అని పేర్కొన్నారు. అసలు ప్రోగ్రాం మూడు పాస్ ల్లో మూడు రకాలు గా పేర్కొనడం లోనే ఢిల్లీ లో గల్లి యవ్వారం లాగా ఉంది అని కొంతమంది పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఈ విద్యా సంస్థ నిర్వహణ లోనే అనేక లోపాలు ఉన్నయి అని టీ మీడియా పరిశీ లనలో వెల్లడి అయ్యాయి..ఫైర్ సేఫ్టీ తో పాటు, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్,చివరకు పోలీస్ ట్రాఫిక్ నిబంధనలు కు విరుద్ధం గా స్కూల్ నిర్వహణ ఉంది.అందుకు సమంధించిన పూర్తి వివరాలు,ఆధారాలు తో టీ మీడియా మరో కథనం మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube