గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక

గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక

0
TMedia (Telugu News) :

గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక

టీ మీడియా, ఏప్రిల్ 7, జన్నారం:గంగపుత్ర సంఘం మండల కమిటీని గురువారం రోజు సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గంగపుత్ర సంఘం మండల నూతన అధ్యక్షుడుగా కల్లెడ నర్సయ్య, ఉపాధ్యక్షుడుగా ఆసంపెల్లి అనిల్, ప్రధాన కార్యదర్శిగా శాఖపురం రవి, కార్యదర్శిగా శాఖపురం రాజన్న, కోశాధికారిగా సింధుల్ల భూమేష్, సంయుక్త కార్యదర్శిగా ధర్మాజీ సత్తయ్య, ప్రచార కార్యదర్శిగా కల్లెడ నరేష్, ముఖ్య సలహాదారులుగా ఏరుగట్ల మల్లయ్య మరియు సలహాదారులుగా జినుక లచ్చన్న, కల్లెడ భూమయ్య, పళ్ళికొండ రాజన్న, కార్యవర్గ సభ్యులుగా పళ్ళికొండ గంగన్న, ముచ్చకుర్తి చంద్రశేఖర్, శాఖపురం శంకర్, చిట్యాల భీమేష్, చిట్యాల బాలయ్య, మగ్గిడి గంగయ్య, జినుక రాజ్జన్న లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Also Read;ఇల్లును కాలపెట్టిన ఎలుక :రూ. 2 లక్షల నగదు దహనం..

.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మండల గంగపుత్ర సంఘ అభివృద్ధికై తమ వంతు కృషి చేస్తామని అన్నారు. చెరువులు, కుంటలు మరియు గోదావరి పై చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఎదురవుతున్న సమస్యలు మరియు సంఘ సమస్యలు ఏమున్నగాని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. గంగపుత్రులను ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు వేడుకున్నారు .ఈ కార్యక్రమంలో జన్నారం మండల గంగపుత్ర సంఘ పెద్దలు కల్లెడ భూమయ్య, తోకల విజయ్, కల్లెడ రాజన్న,శాఖపురం రాజన్న, ఏరుగట్ల రాజు, తోకల హరీష్,గంగపుత్ర మండల యువజన అధ్యక్షుడు పందిరి మనీష్,యువకులు తదితరులు పాల్గొన్నారు

Also Read;3హాస్పిటల్స్ 2 ల్యాబ్స్ సీజ్. -లక్షెట్టిపేట్ లో జిల్లా వైద్యాధికారుల టీం ఆకస్మిక తనిఖీలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube