గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోండి

ఆర్యవైశ్య సంఘం, వనిత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు

1
TMedia (Telugu News) :

గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోండి
ఆర్యవైశ్య సంఘం, వనిత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు
టీ మీడియా, జులై19,ముదిగొండ :మండలంలోని గోకినేపల్లి గ్రామం హైస్కూల్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారని నిరసనగా తహసిల్దార్ కార్యాలయం ఎదురుట ఉన్న మహాత్మ గాంధి విగ్రహనికి కళ్లకు నల్ల బ్యాడ్జ్ కట్టి పాలభిషేకం చేశారు. అనంతరం విగ్రహాన్ని ద్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్ధానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. భారత జాతిపిత అయిన మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయటం చాలా అవమానకరమని వెంటనే ఇటువంటి వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

 

Also Read : వరద బాధితులకు నీళ్ళు అందించేందుకు ట్యాంకర్ల తరలింపు

ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని వారు పిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు తట్టమర్తి వీరయ్య, వాసవి క్లబ్ అధ్యక్షుడు దేవెళ్ల శ్రీనివాసరావు, కురివెళ్ళ స్వాతి, ఆర్యవైశ్య కార్యదర్శి గోళ్ళ నరసింహారావు, , ఖమ్మం నగర అధ్యక్షుడు గోళ్ళా రాధాకృష్ణ మూర్తి, నగర కార్యదర్శి గుమ్మడవల్లి శ్రీనివాసరావు, నగర ఉపాధ్యక్షుడు మాశెట్టి వరప్రసాద్, వాసవి సేవాదళ అధ్యక్షులు పబ్బతి ప్రదీప్, జిల్ల జాయింట్ సెక్రటరీ వేమూరి సుబ్బారావు, మండల డివిజన్ నాయకులు తట్టమర్తి నాగేశ్వరరావు, వోలేటి బాబురావు, కురివెళ్ళ సతీష్, గోపాలకృష్ణ, అశోక్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube