మీ ఇంటి ముందే నిమజ్జనం

ఫ్రీడమ్‌ ఆయిల్‌ కంపెనీ ప్రత్యేక వాహనాలు

1
TMedia (Telugu News) :

మీ ఇంటి ముందే నిమజ్జనం..

-ఫ్రీడమ్‌ ఆయిల్‌ కంపెనీ ప్రత్యేక వాహనాలు

టీ మీడియా,సెప్టెంబర్,3,సనత్‌నగర్‌ : వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే గణేషుడి చెంతకు వచ్చే సరికొత్త విధానానికి ఫ్రీడమ్‌ ఆయిల్‌ కంపెనీ నాంది పలికింది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద ఆ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ‘ఎకో ఫ్రెండ్లీ గణేష్‌ నిమజ్జనం వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. తొలిసారిగా ప్రయోగాత్మకంగా కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ల నివాసితులకు ఈ సేవలను అందించనున్నారు.

Also Read : సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండ‌ర్.. 

వీటిని శుక్రవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాలపై ఏర్పాటుచేసిన నీటి తొట్టెలో వినాయకుడి విగ్రహాన్ని మంత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసేవిధంగా వాహనాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ వాహనాలను అవసరాలను బట్టి వచ్చే ఏడాది మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ ఫుడ్‌ చైర్మన్‌ రాజీవ్‌సాగర్, ఫ్రీడమ్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ సురేష్‌ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube