పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల సామూహిక అత్యాచారం
పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల సామూహిక అత్యాచారం
పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల సామూహిక అత్యాచారం
మీడియా, నవంబర్ 29,హైదారబాద్ : హైదారబాద్‌లో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతటి ఆగకుండా అత్యాచారం చేస్తూ వీడియో కూడా చిత్రీకరించారు. ఈ వీడియోను ఆ తర్వాత స్కూల్లోని మిగిలిన విద్యార్థులకు షేర్ చేశారు.ఎక్కడో పల్లెల్లో కాదు…నగరాల్లో…అదీ టీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో సైతం ఆడపిల్లలకు భద్రత కరువైంది. అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే ఆడపిల్లల రక్షణ సమస్య తల్లిదండ్రులను హడలెత్తిస్తోంది. నిన్నగాక మొన్న హైదరాబాద్‌లోని పాఠశాలలో పసిపిల్లపై జరిగిన ఘోరం మరువకముందే… మరోచోట మరో దారుణం బయటపడింది. హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఓ స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ తట్టిఅన్నారంలో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులే ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. ముందు నుంచి రెక్కి నిర్వహించిన నిందితులు ఇంట్లో ఎవరూ లేని సమయం గమనించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
Also Read : వివేకా హత్యకేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ..
తోటి విద్యార్థి అని కూడా ఆలోచించకుండా క్రూరమైన తోడేళ్ళుగా మారిపోయారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికపాల్పడ్డారు. తనను విడిచిపెట్టాలని ఎంత మొత్తుకున్నా కనికరం చూపించలేదు. అత్యాచారం సమయంలో నిందితులలో ఒకరు వీడియోను తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెందిరింఅయితే పదిరోజుల తర్వాత ఇదే ఐదుగురు విద్యార్థులు మరోసారి బాలికపై అత్యాచారం చేశారు. రేప్ చేస్తుండగా మరోసారి వీడియో తీశారు. ఈ వీడియోలను నిందితులు తోటి విద్యార్థులకు షేర్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.