గంజాయి పట్టివేత

ఇద్దరు అరెస్ట్

1
TMedia (Telugu News) :

గంజాయి పట్టివేత
– – ఇద్దరు అరెస్ట్
టి మీడియా,జూలై26,పాల్వంచ:
ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మేంట్ ఆసిస్టెంట్ కమీషనర్ గణేష్ గారి ఆదేశాలతో, ఏ ఈ ఏస్ తిరుపతి సూచనలతో సిఐసర్వేశ్వర్ ఆధ్వర్యంలో టీం జగన్నాధ పురం గ్రామం పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించగా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లా ఆత్కూర్ చెందిన ఇద్దరు వ్యక్తులు.ప్రత్తిపాటి రాజేష్, మీసపోగు సంజయ్ లు వద్ద నుండి (29)కేజీల ఎండు గంజాయి ని , ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకొనైనది.

 

Also Read : ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

వారిని విచారించగా ఆంద్రప్రదేశ్ లోని సీలేరు వద్ద గంజాయి ని కొనుగోలు చేసి దానిని విజయవాడ కి తీసుకువెళ్లి అక్కడ చిన్న చిన్న పాకెట్స్ చేసి ఒక్కో పాకెట్ Rs.500 కి విక్రయిస్తామని ఈ విధమైన వ్యాపారంను గత కొంతకాలంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తదుపరి చర్యలు నిమిత్తం వారిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్ పాల్వంచ లో అప్పగిస్తామని అని సిఐ సర్వేశ్వర్ తెలిపారు.
ఇట్టి దాడులలో
ఏస్ ఐముభాషీర్ అహ్మద్
హెడ్ కానిస్టేబుల్స్ కరీం,బాలు
కానిస్టేబుల్స్ సుదీర్,హరీష్, వెంకట్ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube