టీ మీడియా,నవంబర్30,కరకగూడెం:
కస్తూరిబా బాలికల పాఠశాలలో మెరుగైన సేవలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కింది స్థాయి వరకు ఫలితాలు అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం కోసం ఆకస్మిక తనిఖీ కరకగుడెం,పినపాక మండలంలో నిర్వహించడం జరిగిందని జిసిడీవో జే.అన్నమణి తెలిపారు. కేజీబీవీ కరకగూడెంలో రికార్డులను,నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షించి విద్యార్థినులతో ముచ్చటించి విద్యాబోధన పట్ల హాస్టల్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఉద్యోగులందరూ సమయపాలన పాటించి విద్యార్థునులకు శక్తివంచన లేకుండా సేవలు అందించాలని కోరారు.తరువాత కేజీబీవీ పినపాక పాఠశాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థునులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తున్న కేజీబీవీ కరకగూడెం స్పెషల్ ఆఫీసర్ డి.శ్రీదేవిని,కేజీబీవీ పినపాక స్పెషల్ ఆఫీసర్ అరుణను అభినందించారు.
కేజీబీవీ కరకగూడెంలో ఆర్ బి ఎస్ కే మణుగూరు టీమ్ బి వైద్యులు డాక్టర్ నరహరి,డాక్టర్ ఉమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థునులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎన్ఎం శ్రావణి,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.