తపోవనంలో గీతా జయంతి ఉత్సవాలు

తపోవనంలో గీతా జయంతి ఉత్సవాలు

1
TMedia (Telugu News) :

తపోవనంలో గీతా జయంతి ఉత్సవాలు

టీ మీడియా, డిసెంబర్ 3, అశ్వారావుపేట : నియోజవర్గ కేంద్రమైన అశ్వరావుపేటలో గీతా జయంతి ఉత్సవాలను అశ్వరావుపేట వికాస తరంగిణి వారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కెమిలాయిడ్స్ నందు ఉన్న తపోవనం లో వికాస తరంగిణి అధ్యక్షులు వేలూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భక్తులకు గీతా సారాంశాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత అని,నేడు ఆ భగవద్గీత పుట్టినరోజు న ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారని భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహన ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం అని అన్నారు.

Also Read : కల్తీ మద్యం తాగి స్కూల్‌ ప్రిన్సిపల్‌ సహా ముగ్గురు మృతి

అనంతరం శ్రీ కృష్ణుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ద ప్రసాదాలు తీసుకొని అందరూ సహపంక్తి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు వేణుగోపాల్,రామానుజం, రాజేశ్వరరావు, రామకృష్ణ, దండు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube