టీ మీడియా,డిసెంబర్ 15,పినపాక:
పినపాక లో నూతనంగా నిర్మాణామవుతున్న భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయమై ఆదివాసీ సేన జిల్లా కో కన్వీనర్ వజ్ఙా జ్యోతిబసు ఆధ్వర్యంలో భూ నిర్వచిత గ్రామాల ఆదివాసులతో టి ఎస్ జెన్కో (బి టి పి ఎస్) సి ఈ ని కలవడం జరిగింది.
5 వ షెడ్యూల్డ్ ప్రాంతం అయినటువంటి మణుగూరు పినపాక మండలలలో నూతనంగా నిర్మించినటువంటి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రo (బి టి పి ఎస్) నకు ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో నిర్వాసితులు అవుతున్న నిరుద్యోగ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ప్రచారం చేసి పెసా గ్రామ సభల యందు హామీ ఇవ్వడం జరిగింది.
వ్యవసాయ భూములు కోల్పోయి ప్రభుత్వం వారు ఇచ్చే ఉపాధి ఉద్యోగాల ద్వారా మేము ఆర్థికంగా బలోపేతం అవ్వగలం అని ఒప్పుకోవడం జరిగింది.
కాని ప్రస్తుతం స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడం లేదు. చూపించక పోగా గ్రామ సభలో చెప్పిన అంశాలను అభిప్రాయాలకు విరుద్ధంగా చేస్తుంది. సమత జడ్జిమెంట్ 1996 ప్రకారం గిరిజనులకు ప్రాథమికంగా ఉపాధికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం విద్యా అర్హత లేనివారికి శిక్షణ ఇచ్చి అర్హులను చేయడం, గిరిజనులతో కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటుచేసి ఉపాధి మరియు పరిశ్రమలో అవకాశాలు కల్పించడం, పర్యావరణం పెంపొందించడం, నిర్వాసితుల ప్రభావిత ప్రాంతాలలో ప్రాథమిక వసతుల కల్పన చేయమని ,గ్రామసభ తీర్మానాలకు అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ వ్యవహరిస్తున్నట్లు అయితే అట్టి తీర్మానమును సైతం రద్దు పరుచు కోవచ్చు అని ప్రజలకు తెలపడం జరిగింది.
భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లో గల ఆదివాసి నిరుద్యోగ యువకులకు సి ఎల్ పోస్ట్లు మరియు ఆర్టిజన్స్ ,స్కిల్ఢ్,సెమి స్కిల్ఢ్,మరియు ఆన్ స్కిల్డ్, ద్వారా ఉపాధి కల్పించాలని కోరడం జరిగింది.
2018 లో ఐటిడిఎ పిఓ పమేలా సత్పతి మూడు వందల మంది నిర్వాసిత గ్రామ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని బి టి పి ఎస్ సీఎండి కి ఆదేశాలు పంపించడం జరిగింది కానీ ఇప్పటివరకు ఏ ఒక్క నిరుద్యోగ ఆదివాసి యువకులకు ఇవ్వకపోగా గిరిజనేతరలకు ఉపాధి కల్పించడం జరిగింది. సీఎస్ఆర్ నిధుల ను ఉపయోగించి భూ నిర్వాసిత గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని వారు కోరగా టి ఎస్ జెన్ కో (బి టి పి ఎస్) సి ఈ సానుకూలo గా స్పందించారు. ప్లాంట్ లో ఎటువంటి పని అయిన భూ నిర్వచిత గ్రామాల ఆదివాసీ సొసైటీ లకు అప్పగిస్త మని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా కో కన్వీనర్ వజ్ఙా జ్యోతి బస్, బొగ్గo రమేష్,సోలం వినయ్ కుమార్, సొఢె రవి మరియు, పుణెం రమేష్,సొఢె వెంకటేశ్వర్లు, పూణెం బాలకృష్ణ,పడిగ వికాష్, జయచందర్ పాల్గొన్నారు.