టీఎన్జీవో నేత అఫ్జల్ హసన్ ఔదార్యం..

అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టుకు ఆర్థిక సాయం

1
TMedia (Telugu News) :

టీఎన్జీవో నేత అఫ్జల్ హసన్ ఔదార్యం..

అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టుకు ఆర్థిక సాయం

టీ మీడియా,నవంబర్ 9,ఖమ్మం : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ జర్నలిస్టుకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేసి టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. కె. అఫ్జల్ హసన్ ఔదార్యం చాటుకున్నారు. ఖమ్మం నగరానికి చెందిన పేరబోయిన తిరుపతిరావు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు ఆయనకు ఆపరేషన్ అవసరం అని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా నాయకత్వం పలువురు ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లింది. టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు అఫ్జల్ హసన్ మానవతా హృదయంతో స్పందించి.. ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చారు.

Also Read : బిలీఫ్ ఆస్పత్రి లో ఐటి తనిఖీలు

బుధవారం ఖానాపురం లోని బాధిత జర్నలిస్ట్ తిరుపతిరావు ఇంటికి వెళ్లి ఈ ఆర్థిక సాయాన్ని అందజేసి, ధైర్యంగా ఉండాలని భరోసా నిచ్చి, తొందరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, సహాయ కార్యదర్శి వెన్నబోయిన సాంబశివరావు, చిర్ర రవి, షమీర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube