చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు

చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు

2
TMedia (Telugu News) :

చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు !

టీ మీడియా, సెప్టెంబరు 28, వరంగల్ :జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ.. వరంగల్ తిమ్మాపేట్ మిర్చి రైతు ఉత్పత్తి సంస్థ మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన జన్నా రెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యాన పరిశోధనా కేంద్రం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసింది. ‘టమాట చపాటా వరంగల్ మిరపకాయ’ అని కూడా పిలువబడే చపాట మిర్చి ఎక్కువ ఎరుప రంగు ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుంది.

Also Read : ఆరు నెలల పరిచయంతో రూ.60 లక్షలు కొట్టేశాడు

చపాట మిర్చి
జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. తెలంగాణ నుంచి పోచంపల్లి ఇకత్, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్ వంటితో పాటు మరికొన్ని భౌగోళిక గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఆ రేసులో దేశంలోనే అత్యంత తీపి మిర్చి రకంలో ఒకటైన చపాట వరంగల్ మిరప నిలిచింది.
వరంగల్ చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ.. వరంగల్ తిమ్మాపేట్ మిర్చి రైతు ఉత్పత్తి సంస్థ మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన జన్నా రెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యాన పరిశోధనా కేంద్రం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసింది. ఏడాది కాలంగా భౌగోళిక గుర్తింపు సాధించేందుకు అవసరమైన సాగు విధానాలు, దాని పుట్టుక, తెలుగులో ఎన్ని రకాలుగా పిలుస్తారు వంటి అంశాలపై ఉద్యాన పరిశోధనా కేంద్రం అధికారులు అధ్యయనం చేశారు. ఈ మిర్చిలోని పోషక విలువలను రాజేంద్రనగర్‌లోని క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్‌బోర్డులో (Spice Board) పరీక్ష చేయించారు.

Also Read : రామ్‌కో సిమెంట్ కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ వాచీలు, హెడ్ ఫోన్స్, కంప్యూటర్ యాక్సిసరీలు ఇంకా మరెన్నో వాటిపై బ్లాక్ బస్టర్ డీల్స్

‘టమాట చపాట వరంగల్ మిరపకాయ’ అని కూడా పిలువబడే చపాట మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికమన్‌ను పోలి ఉండే ఈ మిరప వరంగల్‌లోనే పండుతుంది. ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుందని ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు, మిర్చి రైతులు తెలిపారు. స్కోవిల్లే స్కేల్‌లో ఈ మిరపకాయ యొక్క ఘాటు తక్కువగా ఉంటుందని తేలింది. ఈ మిర్చిని ఆహారశుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్‌, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.23 వేల నుంచి రూ.25 వేలు పలుకుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube