మే డే వేడుకలను విజయవంతం చేయాలి ఖమ్మం ఏఎంసి చైర్ పర్సన్ డీ లక్ష్మీ ప్రసన్న
మే డే వేడుకలను విజయవంతం చేయాలి ఖమ్మం ఏఎంసి చైర్ పర్సన్ డీ లక్ష్మీ ప్రసన్న
మే డే వేడుకలను విజయవంతం చేయాలి ఖమ్మం ఏఎంసి చైర్ పర్సన్ డీ లక్ష్మీ ప్రసన్న
టి మీడియా, ఎప్రిల్ 29,ఖమ్మం:
ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మే 1వ తేదీన ఖమ్మం మార్కెట్ కమిటీ, టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే వేడుకలను విజయవంతం చేయాలని ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిలుపునిచ్చారు.
శుక్రవారం హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో అసోసియేషన్ అధ్యక్షుడు తోట రామారావు అధ్యక్షతన మార్కెట్ కార్మికులు వ్యాపారుల మేడే సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరు కాబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఉదయం 9 గంటలకు పత్తి మార్కెట్ దగ్గర జెండా ఆవిష్కరణ తర్వాత, నగరంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు.
Also Read : ఎసైన్డ్, పట్టా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు ఆర్డీవోకి వినతిపత్రం .*
ర్యాలీలో మంత్రి పువ్వాడ తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు పాల్గొంటారన్నారు.
కావున కావున మార్కెట్ కార్మికులు భారీగా తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. అనంతరం రామారావు మాట్లాడుతూ ఉదయం ఏడు గంటలకు హోల్సేల్ కూరగాయల మార్కెట్ లో టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ జరుగుతుందన్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి పత్తి మార్కెట్ వద్దకు ర్యాలీగా బయలుదేరాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోళ్ళ అవినాషు, వ్యాపారులు పత్తి రవి, షేక్ ఉస్మాన్, టిఆర్ఎస్ పార్టీ విభాగం నాయకుడు సాయి కిరణ్ , కార్మికులు ఆయా ముఠాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.