ఇంగ్లీష్ మీడియం బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవ్వాలి

జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

1
TMedia (Telugu News) :

ఇంగ్లీష్ మీడియం బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవ్వాలి.
-జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
టి మీడియా, మార్చి 30, లక్షెట్టిపేట:వచ్చే ఏడాది నుంచే ప్రారంభమయ్యే ఇంగ్లీష్ మీడియం బోధనకు ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ లో అందరూ భాగస్వాములవ్వాలన్నారు.ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ లో ఉపాధ్యాయులు తప్పకుండా ప్రతిభను చాటాలన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ముఖ్యంగా ఇంగ్లీష్ భాష ప్రాధాన్యతను ఉపాధ్యాయులు పరిశీలించి బోధనకు సిద్ధమవ్వాలన్నారు.వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వ తరగతి వరకు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం లో బోధనను ప్రారంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఉపాధ్యాయుడు ఇప్పటి నుంచే తగిన విధంగా బోధనకు సంసిద్ధులవ్వాలని సూచించారు.అంతకుముందు ప్రభుత్వ పాఠశాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలపై పంచాయత్ రాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలల్లో ఇన్పుట్ డేటా,ఇతర వివరాలను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మండల విద్యాధికారి కాసుల రవీందర్,ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ప్రోగ్రాం డైరెక్టర్ యశోధర,మెంటర్స్ తిరుపతి, పింగళి వేణు గోపాల్,కృష్ణ కాంత్,ఉపాధ్యాయులు ఉన్నారు.

Also Read : దళితబంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న ప్రజా ప్రతినిధులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube