పూర్వ విద్యార్ధుల ఆత్మీయా సమ్మేళనం

పూర్వ విద్యార్ధుల ఆత్మీయా సమ్మేళనం

0
TMedia (Telugu News) :

పూర్వ విద్యార్ధుల ఆత్మీయా సమ్మేళనం

టీ మీడియా, అక్టోబర్ 16, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని సి.ఎస్.ఐ రైడల్ హై స్కూల్ లక్షెట్టిపేట 2001 -2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథి గా ప్రెస్బిటర్ ఇంచార్జీ రెవ.ఎస్. డెవిడ్ పాల్ హాజరయ్యారు.రిటైర్డ్ టీచర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. మన జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది అని ఈ స్కూల్ లో చదువుకున్న చాల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి స్థాయిలో ఉన్నారు అని చెప్పారు.ఈ బ్యాచ్ కు చెందిన చాల మంది ప్రభుత్వ ఉద్యోగలను,వివిధ రంగాల్లో మంచి స్థాయిలో ఉండడం గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు.ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులని శాలువలతతో,ఘనంగా సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు హాజరు అయినందున ధన్యవాదాలు తెలిపారు.తాము చదువుకున్న రోజుల ను గుర్తు చేసుకున్నారు.ఆ రోజుల్లో చక్కగా చదివి నందుకు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నామని తెలిపారు.

Also Read : చర్చకు మీ కొడుకు నా, అల్లుడు వస్తాడా

ఎన్నో సంవత్సరాల తర్వాత మిత్రులందరూ కలిసి నందుకు పరస్పర శుభాకాంక్షలు తెలుపుతూ,వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,రిటైర్డ్ టీచర్స్ ధన లక్ష్మి, సుబ్బాయమ్మ, సంజీవ్ రెడ్డి,శకుంతల,సఫలా. ఆశ్విన్.సి.ఎస్.ఐ.ప్రిన్సిపాల్ సుమతి,వార్డెన్ థామస్,పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube