ఘనంగ సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

-జెండాలను ఆవిష్కరించిన బెజవాడ రవి, ఊట్ల కొండలరావు

0
TMedia (Telugu News) :

ఘనంగ సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

-జెండాలను ఆవిష్కరించిన బెజవాడ రవి, ఊట్ల కొండలరావు

టి మీడియా, డిసెంబర్ 26,మధిర :  సిపిఐ ఆఫీస్ దగ్గర పార్టీ పతాకాన్ని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవి, వాసిరెడ్డి వెంకటపతి గారి స్థూపం దగ్గర మండలకార్యదర్శి ఊట్ల కొండలరావులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బెజవాడ రవి మాట్లాడుతూ భారత దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆవిర్భవించి 98వ సంవత్సరం పూర్తి చేసుకొని 99వ సంవత్సరం లోకి అడుగుపెడుతుందని ఈ సుదీర్ఘ పోరాటాలలో అనేకవిజయాలు కొన్ని అనుభవాలు నేర్చుకొని పేదలకోసం నిలబడి పోరాడేది ఒక్క ఎర్ర జెండానే అనేవిషయాన్ని నేటితరం గుర్తుంచుకోవాలని రాబోయే రోజులలో ముఖ్యంగా పేద ప్రజలందరూ సిపిఐకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

Also Read : ప్రజా వాణి నిర్వహిస్తున్న మంత్రి సీతక్క

ఈ శుభ వేళ సిపిఐ అభిమానులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు విప్లవాభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మధిర మండల కార్యవర్గ సభ్యులు మంగళగిరి రామానుజం, పంగా శేషగిరి,చెరుకూరి వెంకటేశ్వరరావు,మారారెడ్డి, అన్నవరపు సత్యనారాయణ,రంగు నాగకృష్ణ, జల్లా భ్రమ్మం, నాయికర్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి రామకృష్ణ విల్సన్ రావు మొదలగువారు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube