ఘనంగా శ్రీనివాస రామానుజం జయంతి వేడు లు టీ మీడియా బోనకల్

0
TMedia (Telugu News) :

జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని బోనకల్ మండలం లో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీనివాస రామానుజం 134 వ జయంతిని
ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నళిని శ్రీ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నళిని శ్రీ మరియు గణిత అధ్యాపకులు ఏ.యు.ఎమ్ కృష్ణ లను విద్యార్థులు శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు శ్రీనివాస రామానుజం గొప్పతనం గురించి స్మరించుకున్నారు.ఆయన గణిత శాస్త్రంలో చేసిన ఆవిష్కరణలు చాలా గొప్పవని, విద్యార్థులను ఉద్దేశించి సన్మాన గ్రహీతలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలోనే ఇటీవల ప్రకటించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసారు.ఈ బహుమతులను కళాశాల లైబ్రేరియన్ ప్రసాద్ బాబు స్పాన్సర్ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు.ఈ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన విద్యార్థులందరూ చక్కగా చదువుకుని అభివృద్ధి లోకి రావాలని కోరారు.అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల అందరికీ వారికి ఉపయోగపడే వాల్యుబుల్ బుక్స్ ను బహుమతులను అందించారు. విద్యార్థులను ఉద్దేశించి కళాశాల అధ్యాపకులు అందరు ప్రసంగిస్తూ ప్రతిరోజు కళాశాలకు వస్తూ, క్రమశిక్షణతో ఉంటూ, అంకితభావంతో చదువుకొని మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు కళాశాలకు పేరు తేవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుమతులను అందించిన ప్రసాద్ బాబు కు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.

Ghananga Srinivas Ramanujam Jayanti Celebrations 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube