19న ఘంటసాల శతజయంతి

19న ఘంటసాల శతజయంతి

1
TMedia (Telugu News) :

 19న ఘంటసాల శతజయంతి

టి మీడియా,నవంబర్ 15,ఖమ్మం : శ్రీరామహిల్స్ లోపారుపల్లి సురేష్ , కొమర్రాజు మాధవరావు , ఉపాధ్యక్షులు వి.వి.రెడ్డి , కార్యదర్శి జి. విద్యాసాగర్ , కోశాధికారి పి.జె. వినయ్ కుమార్ , ప కె.వి. రమణారావు ,పిన్నెల్లి యాదగిరి , శ్రీనివాస రావు లు ఘంటసాల శత జయంతి వేడుకల ఆహ్వానకార్డును ఆవిష్కరించారు . ముఖ్యఅతిథిగా ఖమ్మం అడిషనల్ (డి.సి.పి.) ఎ. సుభాష్ చంద్రబోస్ ,వీరితోపాటు మరికొందరు విశిష్టత అతిథిలు పాల్గొంటారని పేర్కొన్నారు . స్వర సుధ మ్యూజిక్ అసోసియేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ స్వర్గీయ ఘంటసాల శత జయంతి వేడుకలను ఈనెల 19వ తేదీ శనివారం భక్తరామదాసు కళాక్షేత్రం నిర్వహిస్తున్నామని గౌరవ అధ్యక్షులు పారుపల్లి సురేష్ తెలిపారు .

Also Read : యువకుడు ఆత్మహత్య

సా॥గం॥ 4.00 ల నుండి శత గాన స్వరార్చన మరియు ఘంటసాల గానామృత సినీ సంగీత విభావరిచే ఏర్పాటు చేయడమైనదనీ ఈ కార్యక్రమమునకు ప్రత్యేక గాయనీ గాయకులు , ఘంటసాల ఫేమ్ , అంతర్జాతీయ ఘంటసాల గాయకులు , గాన కళానిధి శ్రీ బాల కామేశ్వరరావు ( హైద్రాబాద్ ) , స్వరసుధా మధుర గాన కోకిల శ్రీమతి వింజమూరి రేవతి ( హైద్రాబాద్ ) , గాన సుధ శ్రీమతి సుధారాణి ( విజయవాడ ) మరియు స్వరసుధ గాయనీ , గాయకుల చే అలనాటి మధుర గీతాలు ఆలపించబడతాయని , చిన్నారి వినూత్న చే నృత్యప్రదర్శన ప్రదర్శించబడుతుందన్నారు . కావున కళాపోషకులు , ఘంటసాల అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు .
💐

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube