భద్రాద్రి రామాలయంలో ఘనంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పుట్టినరోజు వేడుకలు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్,13, భద్రాచలం

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం టి.యు.డబల్యు. జె(టి.జె.ఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి తోటమళ్ళ బాలయోగి ఆధ్వర్యంలో భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అల్లం నారాయణ వారి కుటుంబ సభ్యులు పేరుమీద ఆలయ ప్రధాన అర్చకులు నామార్చన గావించి వారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుమ్మడపు దుర్గా ప్రసాద్,డివిజన్ నాయకులు కాటా సత్యం, పడగా సురేష్,మహిసాక్షి రామాచారి,అల్లాడి వెంకటేశ్వరరావు,పతకమూడి ప్రణీత్,రావాడి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube