బాలికలు వ్యక్తిగత శుభ్రత,వ్యక్తిగత భద్రతతోపాటు ప్లాస్టిక్ నిషేధం కి ప్రాధాన్యతనివ్వాలి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,17, భద్రాచలం

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అవగాహన& సదస్సు బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ.

కౌమార దశలో ఉన్న బాలికలు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత భద్రత మరియు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు జె.డి పౌండేషన్ భద్రాచలం భాద్యుడు శ్రీ మురళి మోహన్ కుమార్,ఈ మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాజంలో వైరస్లు బారి నుంచి కాపాడుకోవాలంటే బాలికల వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే టోల్ఫ్రీ నెంబరు తెలుసుకుని సామాజిక భద్రత కు,సెల్ఫ్ డిఫెన్స్ గురించి నేర్చుకొని తమని తాము రక్షించుకో వాలని కోరారు, ప్లాస్టిక్ నిషేధం,మొక్కలు నాటడం లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అలాగే ఈ కార్యక్రమం కి అవకాశం కల్పించిన ప్రిన్సిపాల్ శ్రీ భద్రయ్య,వైస్ ప్రిన్సిపాల్ శ్రీ రెడ్డయ్య మరియు అధ్యాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మరో సభ్యురాలు శ్రీమతి హన్సి,శ్రీమతి అపర్ణ,శ్రీమతి బండారు కవిత లు మాట్లాడుతూ ప్రత్యేకంగా కౌమార దశలో ఉన్న బాలికలు ఎదుర్కొన్న సమస్యలుకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్,పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల బోటనీ లెక్చరర్ శ్రీ జి.గుప్తా మాట్లాడుతూ ప్రతి ఉన్న సమాజం కి అవసరమైన కార్యక్రమం నిర్వహించినందుకు జేడీ ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కో ఆర్డినటర్ శ్రీమతి డి.సుజాత, కళాశాల లెక్చరర్లు శ్రీమతి రాగ సుగుణ,బి.భవాని,జి. పావని,శ్రీమతి పి.పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

Girls should prioritize personal hygiene, personal safety as well as the Plastic ban.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube