మాఉద్యోగాలు మాకు ఇవ్వండి

మాఉద్యోగాలు మాకు ఇవ్వండి

2
TMedia (Telugu News) :

మాఉద్యోగాలు మాకు ఇవ్వండి

తిరుమలాయపాలెం, అక్టోబర్ 20:

మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి లేదా గద్దె నన్న దిగండి అని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక తిరుమలాయపాలెం మండల తాసిల్దార్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దారు డి. పుల్లయ్యకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల నాయకులు కొమ్ము రాజేష్ అధ్యక్షుడు షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, అలాగే రోజు రోజుకు పెరుగుతున్న అధిక ధరలను నియంత్రించాలని, అర్హులైన నిరుద్యోగులు అయినటువంటి వారందరికీ స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు రెండు కోట్ల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని, ఇప్పటివరకు 9 సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని 18 కోట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

also READ :బోధ వ్యాది నివారణ మాత్రలు పంపిణి 

సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26వ తారీకున కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్నట్టు, మరియు నవంబర్ మూడో తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని యువతకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దిండు మంగపతి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు నేరుసుల వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ నాయకులు కొమ్ము నాగేశ్వరరావు, గుగ్గిళ్ళ సురేష్, పవన్, సాయి, గోపి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube