అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్, సొంత స్థలం వారికిఐదు లక్షలు ఇవ్వాలి

-సిపిఎం పాదయాత్ర ప్రారంభం లో నున్న

1
TMedia (Telugu News) :

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్, సొంత స్థలం వారికిఐదు లక్షలు ఇవ్వాలి

-సిపిఎం పాదయాత్ర ప్రారంభం లో నున్న

టీ మీడియా,డిసెంబర్2,ఖమ్మం : అర్హత కలిగిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పై డిమాండ్ల పరిష్కారం కొరకు ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో గ్రేన్ మార్కెట్ నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

ఈ పాదయాత్ర గ్రేన్ మార్కెట్ నుండి ప్రారంభమై గాంధీనగర్, రంగనాయకులు గుట్ట, పంపింగ్ వెల్ రోడ్డు, అభినవ్ స్కూల్, సుందరయ్య నగర్, ఎఫ్సీఐ రోడ్డు, ప్రకాష్ నగర్, బో సు సెంటర్ మీదుగా గ్రెన్ మార్కెట్ దగ్గర ముగిసింది. ప్రారంభ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పుడు అర్హత కలిగిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అలాగే గత ఎన్నికల ముందు సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు కానీ ఇప్పుడు మూడు లక్షల మాత్రమే ఇస్తామని ప్రకటన చేయడం బాగాలేదు.

Also Read : ఐతం పాడే మోసి నివాళులు అర్పించిన భట్టి

వాగ్దానం చేసిన ప్రకారం ఐదు లక్షల రూపాయలను తప్పకుండా ఇవ్వాలని డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలందరికీ ఇవ్వాలని అలాగే రేషన్ కార్డులు పెన్షన్లు కూడా ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, సిపిఎం సీనియర్ నాయకులు బండారు యాకయ్య, 31వ డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు పత్తిపాక నాగ సులోచన, షేక్ సైదులు, షేక్ హి మామ్, మండల కమిటీ సభ్యులు ఎస్కే బాబు, మద్ది సత్యం, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, సారంగి పాపారావు, పోతురాజు జార్జి, చీకటిమల్ల శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube