2.9 శాతానికి ప‌డిపోనున్న ప్ర‌పంచ‌ ఆర్ధిక వృద్ధి

2.9 శాతానికి ప‌డిపోనున్న ప్ర‌పంచ‌ ఆర్ధిక వృద్ధి

0
TMedia (Telugu News) :

2.9 శాతానికి ప‌డిపోనున్న ప్ర‌పంచ‌ ఆర్ధిక వృద్ధి

– ఐఎంఎఫ్‌

టీ మీడియా, జనవరి 31, వాషింగ్ట‌న్‌ : అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌) ఈ ఏడాదికి చెందిన ఆర్ధిక అంచ‌నాల‌ను రిలీజ్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2022లో 3.4 శాతంగా ఉన్న‌ వృద్ధి .. 2023 నాటికి 2.9 శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ఐఎంఎఫ్ తెలిపింది. ఆ త‌ర్వాత 2024 నాటికి 3.1 శాతానికి ఆర్ధిక వృద్ధి చేరుతుంద‌ని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భార‌త్‌లో ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో ప్ర‌గ‌తి మంద‌గించ‌నున్న‌ట్లు ఐఎంఎఫ్ చెప్పింది. ప్ర‌స్తుతం 6.8 శాతం ఉన్న వృద్ధి.. ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు అలాగే ఉండి, ఆ త‌ర్వాత 6.1 శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ఐఎంఎఫ్ త‌న జ‌న‌వ‌రి రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. అయితే ఇండియాలో 2023 చివ‌రి నాటికి వృద్ధి బాగుంటుంద‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం ఆర్ధిక సంవ‌త్స‌రానికి ఇండియాలో వృద్ధి 6.8 శాతంగా ఉంద‌ని, మార్చి త‌ర్వాత 6.1 శాతానికి ప‌డిపోయే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఐఎంఎఫ్ రీస‌ర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్ పీర్ ఒలివ‌ర్ గౌరించాస్ తెలిపారు.

Also Read : మహాత్మా గాంధీ కి కె సి ఆర్ నివాళులు

భార‌త్‌లో 2022లో ఉన్న 6.8 శాతం వృద్ధి.. 2023లో 6.1 శాతానికి ప‌డిపోతుంద‌ని, ఆ త‌ర్వాత 2024 నాటికి 6.8 శాతానికి ఆ వృద్ధి చేరుకుంటుంద‌ని ఐఎంఎఫ్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల్లో 2023, 2024 సంవ‌త్స‌రాల్లో ఆర్దిక వృద్ధి 5.3, 5.2 శాతంగా ఉంటుంద‌ని ఐఎంఎఫ్ రిపోర్ట్ తెలిపింది. 2022లో చైనా ప్ర‌భావం వ‌ల్ల వృద్ధి కేవ‌లం 4.3 శాతం మాత్ర‌మే ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube