టీ మీడియా,డిసెంబర్ 01,కరకగూడెం:
మండల కేంద్రంలో మంగళవారం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవం సీతారాంపురం గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగింది.కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములు 41 రోజుల దీక్ష చేసి 41 రోజులు అయిన తరువాత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడులు కట్టించుకున్నారు.
ఈ ఇరుముడులను సాయిని నరసింహారావు,తిప్పని శ్రీనివాసరావు గురు స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇరుముడి అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు.
అయ్యప్ప స్వాములు ఇరుముడులు ఎత్తుకోని పొలిమేర వరకు గ్రామాల్లో పాదయాత్రతో అయ్యప్ప భజన చేసుకుంటు వెళ్తుండగా మహిళలు భక్తి శ్రద్ధలతో బిందెలతో స్వాములకు నీలను ఆరభోసి మొక్కలు చెల్లించుకున్నారు.
