ఘనంగా బిర్సా ముండా జయంతి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 15, మంగపేట

మంగపేట మండల కేంద్రంలో రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా ఆదేశానుసారం జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు జబ్బా సమ్మయ్యగారి పిలుపు మేరకు మండల గిరిజన మోర్చా అధ్యక్షుడు కల్తి రామకృష్ణ గారి అధ్యక్షతన జాతీయ ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ్ దివస్ గా మన దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన జయంతి ఉత్సవాలను 15 తారీకు న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి క్రిష్ణ హాజరై మాట్లాడుతూ బిర్సా ముండా1875 నవంబర్15 న జన్మించారు. ఇతను భారతీయ ఆటవిక జాతుల భూమి కోసం, భుక్తి కోసం ఆదివాసుల హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు చేసాడని, ఆ ఉద్యమాల ఫలితంగా 5 వ షెడ్యూల్,6 వ షెడ్యూల్ రావటం జరిగింది అని చెప్పుకొచ్చారు.

స్వతంత్ర సమరయోధులు అయినందున అతని గౌరవార్థం పార్లమెంటులోని సెంట్రల్ హాళ్ళో ఏకైక ఆదివాసీ మహా వీరుని చిత్రపటాన్ని పెట్టడం జరిగిందని తెలిపారు. కనీసం25 సవంత్సరాలు నిండకుండానే ఆటవి తెగల స్వతంత్రీయం కోసం వీరమరణం పొందాడు అని వారి ఉత్సవాలు 17 నుండి22వరకు గ్రామ గ్రామాన జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పొడెం రవీందర్ గారు,జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్ గారు,జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎం డి పాషా మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ ,జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా ,జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు లింగాల చంద్రకళ ,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు , కార్యదర్శి మల్యాల రవి ,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు నరేందర్ గారు,జిల్లా దళిత మోర్చా నాయకులు జాడి రాంబాబు,జిల్లా నాయకులు ధూళిపాళ్ల విజయ్ ,ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ ,మండల యువ మోర్చా అధ్యక్షుడు రామగని అనిల్,మండల నాయకులు వెంగయ్య, చిన్నపల్లి సమ్మయ్య, ఆక తిరుమల రావ,జవంగుల రవి, సురేష్,భూక్య రతన్ సింగ్,కుమార్,నారాయణ,శ్రీనివాస్ .కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tribal Morcha President Jabba Sammayagari on the orders of the State BJP Tribal Morcha.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube