అంగరంగ వైభవంగా సమతా కుంభ్ ఉత్సవాలు
-కనుల పండువగా డోలోత్సవం
లహరి, ఫిబ్రవరి 9,శంషాబాద్ : లోని ముచ్చింతల్ వద్ద కొలువు తీరిన దివ్య సాకేతం క్షేత్రం జై శ్రీమన్నారాయణ మూల మంత్రంతో మారు మ్రోగుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అంగరంగ వైభవంగా సమతా కుంభ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. లోక కళ్యాణం కోసం జగత్ గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సాకేత్ కుంభ్ 2023 ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల తో పాటు దేశం నలుమూలలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారు అందించే తీర్థం కోసం బారులు తీరుతున్నారు.మంగళవారం ఉదయం 11.30 గంటలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో డోలోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవతో పాటు 18 గరుడ సేవలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదం అందజేశారు.
Also Read : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు దర్శన టికెట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 11. 30 గంటలకు కళ్యాణోత్సవంతో పాటు సామూహిక పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4.30 గంటల వరకు భగవద్గీతలో సూపర్ మెమోరీ టెస్టు నిర్వహిస్తారు. అమెరికాతో పాటు దేశానికి చెందిన విద్యార్థులు పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube