ముఖ్య అతిధి గా ..వై జి యం బత్తుల శ్రీనివాసరావు
టి మీడియా, డిసెంబర్ 23, మణుగూరు .
మణుగూరు సింగరేణి ఏరియా కొండాపురం భూగర్భ గని టిబిజికేయస్ ఫిట్ సెక్రటరీ నాగేల్లి నేతృత్వం లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా గని డి వై జియం బత్తుల. శ్రీనివాసరావు పాల్గొన్నారు. గని ఉద్యోగులంతా కలిసి సింగరేణి తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు .
అనంతరం శ్రీనివాసరావు కేక్ ను కట్ చేసి సింగరేణి పుట్టినరోజు శుభాకాంక్షల ను తెలిపారు. గని టిబిజికేయస్ ఫిట్ కమిటి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సంబురాలు ఘనంగా నిర్వహించినందుకు గని అధికారులు, కార్మికులు ఫిట్ సెక్రటరీ నాగేల్లి కి ఫిట్ కమిటి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇంజనీర్ విజయ పాల్ ,సీనియర్ అండర్ మేనేజర్ నరేష్, శ్రీకాంత్,మనోహర్, బిందు సాగర్, టిబిజికేయస్ నాయకులు జైలాలుద్దీన్, పాండు రంగయ్య, నగేష్ ,ప్రసాద్ ఆర్. శ్రీనివాస్, అల్లం.సత్యనారాయణ, తోలేపు శ్రీనివాస్, పవన్ కుమార్, రాజేష్, వై.వినయ్, సింగారం. సతీశ్, నిట్ట. వెంకటేశ్వరరావు, ఫిట్టర్ రాజేష్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు .