వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్సై చల్లా అరుణ

1
TMedia (Telugu News) :

వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

– అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్సై చల్లా అరుణ

టీ మీడియా, సెప్టెంబర్ 9, అశ్వరావుపేట: నియోజవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయము నందు 34వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితి పర్వదినం నుండి ఈనెల 10 వరకు ఈ వేడుకలను ఆలయ కమిటీ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆలయ సన్నిధిన అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్సై చల్లా అరుణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసమరాదన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు తోటి మహిళ భక్తులతో కలసి వడ్డించారు.

 

Also Read : భారీగా రేష‌న్ బియ్యం పట్టివేత

 

జోరు వానలో కూడా ఆలయ కమిటీ బాధ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.సుమారు ఐదువేల మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమాన్ని కి హాజరు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే శనివారం ఊరేగింపు ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నాగలరని కమిటీ బాద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చల్లపల్లి ప్రసాద్ శర్మ, ఘండికోట భరద్వాజ్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి నాగరాజు, శీమకుర్తి విజయ్,శీమకుర్తి జితేంద్ర, శీమకుర్తి ప్రసాద్,అప్పారావు,కురిశెట్టి నాగబాబు,రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube