గో బ్యాక్ మోదీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ

చేనేత యూత్‌ ఫోర్స్‌

1
TMedia (Telugu News) :

గో బ్యాక్ మోదీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ

-చేనేత యూత్‌ ఫోర్స్‌

టీ మీడియా, నవంబర్ 12,హైదరాబాద్ : చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ చేనేత యూత్‌ఫోర్స్‌ డిమాండ్‌ చేసింది. జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టారన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కార్‌ కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రభుత్వమని విమర్శించారు. ప్రధాని మోదీ పర్యటణకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద తెలంగాణ చేనేత యూత్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగరవేసి యువత నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోదీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

Also Read : తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు.

ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని, రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు, పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ విమర్శిచారు. దేశంలోని ప్రముఖ ప్రాజెక్టులను అదాని, అంబానీలకు కట్టబెట్టడం కేంద్ర పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube