గో బ్యాక్ రాహుల్ గాంధీ

కే యు జేఎసి చైర్మన్ బి వీరేందర్

2
TMedia (Telugu News) :

గో బ్యాక్ రాహుల్ గాంధీ -కే యు జేఎసి చైర్మన్ బి వీరేందర్
టీ మీడియా,మే 5,హైదరాబాద్ :ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కే యు జేఏసీ చైర్మన్ బోల్లి కొండ వీరేందర్ మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటన వెనక్కి తీసుకోవటం వల్ల తెలంగాణ విద్యార్థులు 1200 మంది బలిదానాలు చేసుకున్నారని వారి బలిదానాలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని, ఈ యొక్క పార్టీని తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు. పార్టీని నడిపించ లేని అసమర్థ నాయకుడు రాహుల్ గాంధీ ఆయన తెలంగాణకు వచ్చి ఉద్ధరించే ది ఏమిటో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. పబ్బుల్లో క్లబ్బుల్లో కాలక్షేపం చేసే రాహుల్ గాంధీ విద్య సంస్థలోకి అడుగుపెట్టి విద్యార్థులకు ఏమి చెప్పదలచుకున్న డో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అలాంటి వ్యక్తి విద్యా సంస్థల్లో అడుగుపెట్టే హక్కు లేదు అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ ఒక్క రోజు పార్లమెంట్లో మాట్లాడని వ్యక్తి రాహుల్ గాంధీ. అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు ఏమాత్రం లేదు అన్నారు.

Also Read : విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

అదేవిధంగా కే యు జేఎసి వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 6న హనుమకొండలో నిర్వహించబడు సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ తెలంగాణ విద్యార్థి అమరవీరుల కుటుంబాలను కలిసి క్షమాపణ కోరాలని అన్నారు. హనుమకొండ లోని ఉద్యమ కేంద్రం అయినా అదాలత్ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని అన్నారు.యూనివర్సిటీలలో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బో జు శ్రీకాంత్ మైనార్టీ విద్యార్థి సంఘం సయ్యద్ అతిక్, మహమ్మద్ ముజాహిద్, జోగు కుమార్, ఈదురు అనిల్ కుమార్, దుగ్యాల కుమార్, సాయినాథ్, అక్బర్, రహమత్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube