ప్రభుత్వ స్థలాలకు దిక్కేది

ప్రభుత్వ స్థలాలకు దిక్కేది

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ స్థలాలకు దిక్కేది

టీ మీడియా, జనవరి 2, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో చిరు వ్యాపారస్తులు జీవన ఉపాధి కొరకు మున్సిపల్ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ 9 నెలల క్రిందట చిరు వ్యాపారస్తుల డబ్బాలను అక్కడి నుండి తొలగించి భయభ్రాంతులకు గురిచేయడం జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత చిరు వ్యాపారస్తులు అందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ని కలవగా ఆ చిరు వ్యాపారస్తుల నుండి ఒక్కరొక్కరి దగ్గర 50వేల రూపాయలు తీసుకొని వారికి మున్సిపాలిటీ తరఫునుండి రసీదు ఇవ్వకుండా తీసుకోవడం జరిగింది. చిరు వ్యాపారస్తులు ఎన్నిసార్లు కలిసిన అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నాడు. ఇలా 8 నెలల నుండి చిరు వ్యాపారస్తులు చైర్మన్ ని కలిసిన కాలయాపన చేస్తున్నాడు. అందులో భాగంగా ఆదివారం చైర్మన్ చిరు వ్యాపారస్తులను పిలిచి మీ డబ్బాలను మీరే వేసుకోండి అని పురమాయించాడు.

Also Read : ఆరు గ్యారంటీలను అమలుచేసి కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని చాటుకోవాలి

ఈ విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కలిసి రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి ఎంక్వయిరీ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ చిరు వ్యాపారుల నుంచి 50 వేల రూపాయల చొప్పున దాదాపుగా ఆరు లక్షల రూపాయలు ముట్టినావని చిరు వ్యాపారస్తులు చెప్పడం జరిగింది ఒకవేళ చైర్మన్ గారు డబ్బులు తీసుకుంటే అట్టి డబ్బులు మున్సిపల్ ఆఫీసులో జమ చేయాలి.
వ్యాపారస్తులకు రసీదు ఇవ్వాలి నీవు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులకు తెలుపకుండా ఒక కాంట్రాక్టర్ ద్వారా పని స్టార్ట్ చేయడం జరిగింది ఇట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ ద్వారా చైర్మన్ గట్టు యాదవ్ కి తెలియజేయడం మేమనగా మనము రాజుల కాలంలో ఉన్నామా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా మీరే డబ్బులు తీసుకొని మీరే ఖర్చు పెట్టడం ఎంతవరకు న్యాయం. వనపర్తి పట్టణ ప్రథమ పౌరుడవు ప్రభుత్వ స్థలం అనుకున్నావా నీ సొంత జాగీర్ అనుకున్నావా అలా చేయాలనుకుంటే నీ సొంత ప్రాపర్టీలో కట్టించి. ప్రజల ప్రాపర్టీని కాపాడు ప్రభుత్వ స్థలాన్ని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారస్తులకు మున్సిపాలిటీ నుండి శాశ్వత కాంప్లెక్స్ కట్టించి వారికి కేటాయించాలని వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ మున్సిపల్ కౌన్సిలర్స్ డిమాండ్ చేస్తూ తీసుకున్న డబ్బు లో ఖర్చు కాని మిగతా డబ్బులు ఆ చిరు వ్యాపారస్తులకు తిరిగి చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం.

Also Read : మెక్సికోలో కాల్పుల మోత

ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ , వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ , మున్సిపల్ కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు, చీర్ల సత్యం, విభూది నారాయణ, లక్ష్మీ రవి యాదవ్, జయసుధ, మధు గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళి, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ , ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ, అస్లాం, శశాంక్, లతీఫ్, కాజల్, ఆఫీస్ సమీర్ ,రవి సాగర్, బాలు టి తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube