టీ మీడియా ఎఫెక్ట్ ..
టీ మీడియా, డిసెంబర్ 9 మణుగూరు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం , చిన రావిగూడెం గోదావరి పరివాహక ప్రాంతంలో అధికారికంగా సోసైటి ఇసుక ర్యాంపులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ప్రజల సౌకార్యార్థం ఇసుక సరఫరా చేస్తుంది. కానీ కొందరు ఇసుక మాఫియా కేటుగాళ్లు దోడ్డి దారిన ఇసుక దందా చేస్తూ లక్షలు గడిస్తున్నారు.నిత్యం 50 నుండి 60 ట్రాక్టర్ లతో రైయి .. రైయి .. అంటూ మోతలతో హోరెతిస్తూ ప్రజలను నిద్ర పోనివకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక అవసరాన్ని బట్టి 1500 నుండి 3000 రూపాల వరకు అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నారు .
టీ మీడియా ఎఫెక్ట్ .. తో కదిలిన రెవెన్యూ యంత్రాంగం.
ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ అధికారులు చిన రావిగూడెం గోదావరి లోకి ట్రాక్టర్లు వెళ్లు కుండా కందకాలు తవ్వించారు .