గోదావరి నీళ్లు అందే దెన్నడు..

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్,9, భద్రాచలం

రాష్ట్రం అంతా ఇంటింటికి మంచి నీరు ఇచ్చి తీరుతాం. లేదంటే ఓట్లు అడగం అంటూ.. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గతంలో సవాల్ చేశారు.ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లి గెలిచి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ నీళ్లు మాత్రం రావటం లేదు. అధికారుల అలసత్వం అని నాయకులు,కాంట్రాక్టర్ల తప్పులని అధికారులు,ఒకరి పై ఒకరు నిందలేసుకున్నా, మిషన్‌ భగీరథ పూర్తికాలేదని మరోసారి బయటపడింది. రక్షిత మంచినీటిని ప్రతి ఇంటికి ఇస్తాం అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ సర్కార్, ఇప్పటివరకు మిషన్ భగీరథ పనులు పూర్తికాలేదు. ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇవ్వకపోవటం పై భద్రాచలం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కాంట్రాక్టర్లు, వర్కింగ్ ఏజెన్సీలతో త్వరగా పని పూర్తి చేయించకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

భద్రాచలం పట్టణ శివారు కాలనీ లైన జగదీష్ కాలనీ, రిక్షా కాలనీ,రాజుపేట కాలనీ, ఏఎస్ఆర్ కానీల తో పాటు పట్టణం లోని ఇంకొన్ని అంతర్గత కాలనీల్లో ఇంటీంటికి నల్లా కనెక్షన్ ఏమైందంటూ కాలనీ వాసులు పలువురు ప్రశ్నిస్తున్నారు.పక్కనే గోదావరి ఉన్నా ఎప్పుడూ మాకు నీళ్లకు కరువే,ఇప్పటికైనా ఉన్నతాధికారులు,కాంట్రాక్టర్లు, వర్కింగ్ ఏజెన్సీలతో త్వరగా పైపులైన్ పనులు పూర్తి చేయించి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube