న్యాయ దేవతకు సంకెళ్ళు వేయలేరు
– రాష్ట్ర సంస్కృతిక ఉపాధ్యక్షులు సితార వెంకటేశ్వర్లు
టీ మీడియా, నవంబర్ 1, పెబ్బేరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలైన సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చౌరస్తాలో టిడిపి శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెబ్బేరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సితార వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దుర్మార్గమైన పాలనతో కళ్ళు నెత్తికెక్కి అధికార గర్వంతో.. అహంకారంతో.. న్యాయదేవతకు సంకెళ్ళు వేయలేరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీగర్వంతో అమాయకుడైన తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని అభియోగాలు మోపుతూ జైలుకు పంపించారని , న్యాయాన్యాయాల పోరులో ధర్మమే నిరూపితమైందని, ఆంద్ర ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పటికైనా సరిదిద్ధుకుంటే మర్యాదగా ఉంటుందని మీ..కుళ్ళు.. కుతంత్రాలు.. దరిద్రమైన రాజకీయాలు చేస్తే ధర్మదేవత క్షమించదన్నారు.
Also Read : అక్టోబర్‌లో 13 శాతం పెరిగిన జిఎస్‌టి వసూళ్లు
రానున్న రోజులలో ఆంధ్రా తెలంగాణలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అవి వారి మెడకే ఉరితాడులాగా చుట్టుకుంటుందని పెబ్బేర్ మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సితార వెంకటేశ్వర్లు అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube