గోదారమ్మా శాంతించు

మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు

1
TMedia (Telugu News) :

గోదారమ్మా శాంతించు

-మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు

టీ మీడియా, జులై 16, భద్రాచలం: ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగ్రగోదావరి శాంతించాలని నది స్నానఘట్టాల వద్ద వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు.

 

Also Read : ముప్పు బాధిత గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు

 

కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కొద్దిగా తగ్గింది. ఉదయం వరకు 71.20 అడుగులగా ఉన్న నీటిమట్టం ఉదయం 8 గంటలకు 90.70కు చేరింది. వరద ఉధృతి తగ్గడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసివేస్తున్నారు. దీంతో భద్రాచలానికి క్రమంగా నీటిప్రవాహం నెమ్మదిస్తున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube