బంగారు పతకం అందుకున్న కొల్లాపూర్ వాసి
టీ మీడియా, నవంబర్ 25, వనపర్తి బ్యూరో : పాలమూరు జిల్లా విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవ వేడుకలను విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. కొల్లాపూర్ మారుమూల ప్రాంతంలోని శ్రీ గాయత్రీ విద్యాసంస్థల్లో భాగమైన… హాసిని బి.పియిడి కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని ఎంగణేష్ అనే విద్యార్థి పాలమూరు యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ కు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వైస్ ఛాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ చేతుల మీదుగా కొల్లాపూర్ వాసి హాసిని కళాశాల విద్యార్థి ఎమ్ గణేష్ గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
Also Read : పేదల చెంతకు ప్రభుత్వ వైద్యం చారిత్రక నిర్ణయం
ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ అందుకున్న గణేష్ ను రాష్ట్ర ప్రైవేటు కళాశాలల సంఘ ఉపాధ్యక్షులు శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్ చైర్మన్ సూరగౌని శ్రీనివాస్ గౌడ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.సహకరించిన వారి తల్లిదండ్రులకు కొల్లాపూర్ ప్రాంత ప్రజానీకానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.