రూ.60వేలు దాట‌నున్న బంగారం ధ‌ర‌?

రూ.60వేలు దాట‌నున్న బంగారం ధ‌ర‌?!

1
TMedia (Telugu News) :

రూ.60వేలు దాట‌నున్న బంగారం ధ‌ర‌?
టీ మీడియా, ఫిబ్రవరి 20:ఢిల్లీ భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్త‌డి కొనుక్కోవాలని.. ఆభ‌ర‌ణాలు చేయించుకోవాల‌ని మ‌హిళ‌లు ఆరాటం చూపుతారు. అలాగ‌ని బంగారం కేవ‌లం ఆభ‌ర‌ణం మాత్ర‌మే కాదు.. పెట్టుబ‌డికి మార్గం కూడా.. ధ‌ర త‌గ్గిన‌ప్పుడు బంగారంపై పెట్టుబ‌డి పెట్ట‌డం శుభ త‌రుణం అని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు అంటున్నారు. గ‌తేడాది రూ.43 వేల వ‌ద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేల‌కు చేరుకుంది. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య క‌మ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్త‌డి ధ‌ర పెరుగుతూనే ఉంది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1900 డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్టిన ధ‌ర త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. ధ‌ర త‌గ్గడ‌టంతో ప్రాఫిట్ రిక‌వ‌రీ సాధించేందుకు ఆస్కారం ఉంది. మూడు, నాలుగు నెల‌ల త‌ర్వాత‌ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధ‌ర 2000 డాల‌ర్ల‌కు పెరుగుతుంద‌ని అంటున్నారు.

పుత్త‌డిపై ద్ర‌వ్యోల్బ‌ణం ఎఫెక్ట్‌
ర‌ష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్త‌త చ‌ల్ల‌బ‌డినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం పెరుగుతున్న‌ది. దీంతో బంగారం ధ‌ర‌లు పెరగ‌డానికి దారి తీస్తుంద‌ని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు అంటున్నారు. మ‌ధ్య‌లో కొంత కాలం ఔన్స్ బంగారం 1865 డాల‌ర్ల‌కు చేరినా నాలుగు నెల‌ల త‌ర్వాత 2000 డాల‌ర్ల‌కు పెరుగుతుంద‌ని అంచ‌నా. క‌నుక ధ‌ర త‌గ్గిన‌ప్పుడు కొనుగోలు చేస్తే ప్రాఫిట్ పొందొచ్చున‌ని అంటున్నారు. ఈ ఏడాదిలో 63 వేల‌కు దూసుకెళ్లి తిరిగి 50 వేల‌కు దిగి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.స్వ‌ల్ప‌కాలిక కాలంలో దేశీయంగా ఎంసీఎక్స్‌లో తులం బంగారం ధ‌ర రూ.52 వేల వ‌ర‌కూ దూసుకెళ్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజ‌ర్వ్ కీల‌క వ‌డ్డీరేట్లు త‌గ్గించ‌డంతో అమెరికా మార్కెట్‌లో బంగారం ధ‌ర త‌గ్గింద‌ని మోతీలాల్ ఓస్వాల్ వైస్‌ప్రెసిడెంట్ అమిత్ సాజేజా చెప్పారు. ఫెడ్ భేటీకి ముందు స్వ‌ల్పంగా ధ‌ర త‌గ్గిన‌ప్పుడు కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఇన్వెస్ట‌ర్ల‌కు మంచి అవ‌కాశం ల‌భించింద‌న్నారు.
ఇలా ఇరాన్‌-అమెరికా శాంతి చ‌ర్చ‌ల ప్ర‌భావం
మ‌రోవైపు ఇరాన్‌, అమెరికా మ‌ధ్య శాంతిచ‌ర్చ‌ల్లో సానుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు. అదే జ‌రిగితే ముడి చ‌మురు ధ‌ర తాత్కాలికంగా త‌గ్గినా ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం వ‌ల్ల బ్యారెల్ ధ‌ర 90 డాల‌ర్ల పైనే ప‌లుకుతుంద‌న్నారు. దీన్ని బ‌ట్టి ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. త‌క్ష‌ణం ఔన్స్ బంగారం 1950 డాల‌ర్లు, స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యం 2000 డాల‌ర్లు ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు.
త‌క్కువ ధ‌ర ఉన్న‌ప్పుడు ఇన్వెస్ట్ చేయ‌డ‌మే బెస్ట్
దేశీయంగా ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడే బంగారంలో పెట్టుబ‌డి పెట్టాల‌ని మోతీలాల్ ఓస్వాల్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సాజేజా సూచించారు. ప్రాఫిట్ బుకింగ్స్ ఇప్పుడు న‌డుస్తున్నాయి.

ఇది కూడా చదవండి:తొలిసారిగా ఓటేసిన అవిభక్త కవలలు

కొత్త‌గా బంగారం కొనుగోలు చేయ‌డానికి ధర ఎప్పుడు త‌గ్గుతుందో తెలుసుకోవాల‌న్నారు అమిత్ సాజేజా. దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధ‌ర రూ.49,300 వ‌ద్ద ఇన్వెస్ట‌ర్లు కొనుగోలు చేయ‌డం శుభ ప‌రిణామం అన్నారు. రూ.47,500 ధ‌ర వ‌ద్ద న‌ష్టాన్ని నిలిపేయ‌డం బెట‌ర‌న్నారు. వ‌చ్చే మూడు, నాలుగు నెల‌ల్లో తులం బంగారం ధ‌ర రూ.52 వేల‌కు చేరుతుంద‌న్నారు ఐఐఎఫ్ఎల్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా. ఇమిడియ‌ట్ టార్గెట్‌గా రూ.51 వేలు ఉంటుంద‌ని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube