28న వివాహ పంచమి

శుభముహూర్తం, ప్రాముఖ్యత

1
TMedia (Telugu News) :

28న వివాహ పంచమి

-శుభముహూర్తం, ప్రాముఖ్యత

లహరి,నవంబర్ 17 కల్చరల్ : వివాహ పంచమి అనేది శ్రీరాముడు, సీతాదేవి వివాహాన్ని జరుపుకునే హిందూ పండుగ. మార్గశిరమాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున వివాహ పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున సీతారాముల వివాహాన్ని జరిపిస్తారు. వివాహ పంచమి అనేది శ్రీరాముడు, సీతాదేవి వివాహాన్ని జరుపుకునే హిందూ పండుగ. మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం వివాహ పంచమి 28 నవంబర్ 2022 న వస్తుంది.

భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్న దేవాలయాలు, పవిత్ర స్థలాలలో సీతారాముల వివాహ వేడుకను చాలా వైభవంగా చేస్తారు. మనదేశంలోని అయోధ్య, నేపాల్ లోని జానక్‌పూర్‌లో ఈ పెళ్లి వేడుకలు అంబరాన్నింటుతాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మనదేశం నుంచి ఎంతోమంది యాత్రికులు నేపాల్ కు వెళతారు. అందుకే ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ రోజు వివాహానికి పవిత్రమైనదిగా పరిగణించబడదు. వివాహ పంచమి ముహూర్తం మరియు ఈ రోజున వివాహం ఎందుకు నిషిద్ధమో తెలుసుకుందాం.వివాహ పంచమి 2022 ముహూర్తంహిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశీర్ష మాసం యొక్క శుక్ల పక్ష వివాహ పంచమి 27 నవంబర్ 2022 న సాయంత్రం 04.25 నుండి ప్రారంభమవుతుంది.

Also read : నేడు అరటి చెట్టుకు పూజలు చేస్తే

పంచమి తిథి 28 నవంబర్ 2022 మధ్యాహ్నం 01:35 గంటలకు ముగుస్తుంది. అభిజిత్ ముహూర్తం – ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:36 వరకు.వివాహ పంచమి నాడు ఏమి చేయాలి? మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉండాలంటే వివాహ పంచమి రోజున సీతారాములను పూజించండి. ఈరోజున ముందుగా సీతారాముల చిత్రపటాలను ప్రతిష్టించి.. వారికి పూలమాల వేసి ఆరాధన చేయండి. తర్వాత రామాయణంలోని బాలకాండలో ఉన్న వివాహ సంఘటనను పఠించండి.ఈ రోజున పెళ్లికాని అమ్మాయిలు ఓం జానకీ వల్లభాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వారికి రాముడి వంటి వరుడు లభిస్తాడనిచెబుతారు.మీనంలో అరుదైన యోగం… ఈ రాశులకు ఊహించనంత ధనం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube