ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊరట..పిల్ కొట్టివేత

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊరట..పిల్ కొట్టివేత

2
TMedia (Telugu News) :

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊరట..పిల్ కొట్టివేత
టీ మీడియా,మార్చి 16,హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమాను నిలిపివేయాలని అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమ్రుంభీం చరిత్రను వక్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. అటు ఆర్ఆర్ఆర్ సినిమా తరపున కూడా కోర్టులో వాదనలు జరిగాయి. అల్లూరి, కొమ్రుంభీంలను దేశభక్తులుగా చూపామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథేనని, సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చిందని కోర్టుకు వివరించారు. ఇక ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. సినిమాతో అల్లూరి, కొమ్రుంభీంల పేరు, ప్రఖ్యాతలకు భంగం కలగదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Also Read : అసైన్డ భూముల్లో ప్రభుత్వ ప్లాట్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube