నడక మార్గంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..
నడక మార్గంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..
నడక మార్గంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..
లహరి, మార్చి 3, తిరుమల : త్వరలోనే నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల సౌఖర్యార్ధం దివ్య దర్శన టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాంమని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రకటించారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి పాల్గోని భక్తులకు సలహాలు, సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. మెట్ల దారిలో వచ్చే భక్తుల్లో ఎంత మందికి శ్రీవారి సర్వ దర్శనం, ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లు ఉన్నాయో చెక్ చేస్తామని.. ఏ టికెట్లు లేకుండా నడక దారిలో వెళ్లే భక్తులకు… మాత్రమే దివ్య దర్శనం టికెట్లను ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ టికెట్లు ఉన్న భక్తులకు మళ్లీ దివ్య దర్శనం టికెట్లు ఇవ్వబోమని తెలిపారు.ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి… సంబందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేస్తాంమని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెటు వివరాలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.శ్రీవాణి ట్రస్టుకి విరాళం అందించిన భక్తులకు తిరుమలలోని ఏటిజిహెచ్, ఎస్ఎన్జిహెచ్ అతిధి గృహల్లోని 88 గదులను కేటాయిస్తామన్నారు.. అదేవిధంగా కాషన్ డిపాజిట్ విధానంపై మరోకసారి పూర్తి స్ధాయిలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.ఏప్రిల్ నుండి తిరుమలలో ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.
Also Read : ఆ సమయమే ప్రాణాలు నిలుపుతుంది..
ఫిబ్రవరి మాసంలో హుండీ ద్వారా 114.29 కోట్ల ఆదాయం లభించగా, 18.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 92.96 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా, 34.06 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించరు . 7.21 లక్షల మంది భక్తులు తలనీలాలూ సమర్పించారు.మార్చి 2న 60,682 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 24,291 మంది తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీకి కానుకల రూపంలో 3.32 కోట్ల ఆదాయం వచ్చింది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. SSD టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube